ఇక్కడికి రా! చూసుకుందాం: జేసీపై నిప్పులు చెరిగిన జగన్ పార్టీ నేతలు
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలను తీవ్రస్థాయిలో విమర్శించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై జగన్ పార్టీ నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. జేసీ..
కడప: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలను తీవ్రస్థాయిలో విమర్శించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై జగన్ పార్టీ నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. జేసీ.. ఓ బఫూన్, జోకర్ అని, మతి భ్రమించి చిల్లర నాయకుడిలా, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంపీ స్థాయికి తగ్గట్టుగా, హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబులతో కలిసి స్థానిక శాసనసభ్యులు ఎస్‌బీ అంజద్‌బాషా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో వేలమంది పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య మాట్లాడటం పెద్ద గొప్పేం కాదని.. దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా కడపకుగానీ, పులివెందులకుగానీ వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. చెంచాలు వైయస్‌ను తిడుతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందాడని ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు. జేసీ దివాకర్‌రెడ్డి సభ్యత, సంస్కారం మరిచి రోడ్డుపై చిల్లర వాళ్లు మాట్లాడే భాష ఉపయోగించారని మండిపడ్డారు.
చంద్రబాబునాయుడు మెప్పుకోసం, పదవిపై కాంక్షతోనే దివాకర్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి చిత్తూరులో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురంలో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని, తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్పదని అన్నారు.
కృష్ణా జలాలు సీమ జిల్లాలకు రావడంలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని.. సీమలోని అన్ని ప్రాజెక్టులనూ దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడో పూర్తి చేశారని తెలిపారు. గేట్లు ఎత్తి తానే పనులన్నీ చేశానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు.
ఎంపీ జేసీకి మతిభ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారని తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి దుయ్యబట్టారు. దివంగత వైయస్ రాజారెడ్డి, తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే ఆర్హత జేసీకి లేదన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌కు మూలం జేసీ కుటుంబమేనని మండిపడ్డారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications