చిత్తూరులో రూ.400 కోట్ల భూ కుంభకోణం... వైసీపీ నేతలపై నల్లారి కిశోర్ సంచలన ఆరోపణలు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లాలోని పీలేరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు,వారి అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. అందులో లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రి,ఎంపీ,ఎమ్మెల్యేల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భూఆక్రమణలకు పాల్పడినవారిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్‌పై రాజకీయ ఒత్తిళ్లు...: నల్లారి కిశోర్
హైదరాబాద్-చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా... మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూములను గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ప్రభుత్వ భూమి ఒక్క ఇంచు ఆక్రమించినా ఊరుకునే ప్రసక్తే లేదని కిశోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ... రాజకీయ నేతల ఒత్తిళ్లతో స్వేచ్చగా పనిచేయలేకపోతున్నారని ఆరోపించారు. భూఆక్రమణలపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయా సైట్లను ఆమె పరిశీలించారని చెప్పారు. వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటివరకూ చర్యలు లేవన్నారు.

త్వరలోనే అన్నీ బయటపెడుతాం : నల్లారి కిశోర్
ఒక్క చిత్తూరులోనే ఇలా జరుగుతోందా లేక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు.జిల్లాలో భూ కబ్జాలను సర్వే నంబర్లతో సహా త్వరలోనే బయటపెడుతామని... ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలో టీడీపీ నేతల పాత్ర ఉన్నా చర్యలు తీసుకోవాలన్నారు. పీలేరు మాత్రమే కాదు చిత్తూరు జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు.

న్యాయ విచారణ జరిపించాలి...
త్వరలోనే మీడియా ప్రతినిధులను కూడా తీసుకెళ్లి అక్కడేం జరుగుతుందో చూపిస్తామన్నారు. ప్రజలు అక్కడి లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక దానిపై న్యాయ విచారణ జరిపించి భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. టీడీపీ హయాంలో సొంత పార్టీ నేతలు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డా చంద్రబాబు నాయుడు సహించేవారు కాదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని చూసి మంత్రులు,నేతలు భయపడాల్సిందిపోయి... ముఖ్యమంత్రే వారిని చూసి జంకుతున్నారని విమర్శించారు. మంత్రులు,ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి విచ్చలవిడిగా వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని... వాటిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications