చంద్రబాబు అనర్హుడు: '‘బ్రీఫ్డ్ మీ’ అన్న గొంతు తనది కాదని చెప్పలేదు'

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కనీసం పది రోజుల నుంచి పదిహేను రోజులపాటు నిర్వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ఈవెంట్ మేనేజ్మెంట్‌లా నిర్వహించవద్దని సూచించారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'బ్రీఫ్డ్ మీ' అన్న గొంతు తనది కాదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదని, అడ్డంగా దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండటం ఎంత వరకూ సమంజసమని అన్నారు.

Ysrcp leaders on ap assembly sessions hyderabad

తప్పు చేసిన, మచ్చపడ్డ వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగించడం మంచిది కాదని పేర్కొన్నారు. అంసెబ్లీలో లీడర్ ఆఫ్ ద హౌస్ పదవిలో ఉండేందుకు చంద్రబాబు అనర్హుడని ఆయన అన్నారు. లీడర్ ఆఫ్ ద హౌస్ మచ్చలేని వ్యక్తి ఉండాలని అన్నారు. బాధ్యత గల వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

మదర్ థెరిసా, పీవీ సింధుల గురించి చర్చించి అసెంబ్లీ సమావేశాలు హడావుడిగా ముగించొద్దని అన్నారు. ప్రజా సమస్యలపై సభలో అర్థవంతమైన చర్చ జరగాలని, ఈ సమావేశాల్లోనే ఆ సమస్యలకు పరిష్కారం రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, స్విస్ ఛాలెంజ్, కరువు, ప్రభుత్వ అవినీతిపై అర్ధవంతమైన చర్చ జరగాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+