హామీలు అమలు చేయరు-జగన్ పై మాత్రం దుష్ప్రచారం-పేర్ని, మిథున్ రెడ్డి ఫైర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై దుష్ప్రచారానికే పరిమితమవుతోందని వైసీపీ నేతలు ఇవాళ ఆరోపించారు. కూటమి నేతలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. అలాగే వైయస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి చూసి ఓర్వలేక.. జగన్మోహన్ రెడ్డిపై విషం టీడీపీ చిమ్ముతోందని పేర్ని నాని ఆరోపించారు.
వైయస్సార్సీపీలో కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ తన అనుకూల పత్రిక, వారి ఛానెల్స్‌లో ఒకవైపు వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మదనపల్లి ఘటనలో నిజానిజాలు తేలాలని ఇప్పటికే మూడుసార్లు మీడియా ముందు చెప్పామని... ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది, తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అటు మూడు పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను, వారి బాగోగులను గాలికొదిలి... జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారంతో విషం చిమ్ముతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో వదలడంతో పాటు, వాళ్ల జీతగాళ్లతో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని నాని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేనికి ఎంత ఖర్చుపెట్టారో ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలుంటాయని, ధైర్యం ఉంటే ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి అధికారకంగా చర్చకు రావాలని నాని సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారానికి స్వస్తి పలికి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగాప్రభుత్వాన్ని నడపాలని సూచించారు.












Click it and Unblock the Notifications