జగన్ పాదయాత్ర: తిరుమలకు కాలినడకనే, అన్ని జిల్లాల్లో యాత్రకు వైసీపీ ప్లాన్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27వ, తేది నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహలు చేసుకొంటున్నారు.
అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27వ, తేది నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహలు చేసుకొంటున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగేలా రూట్‌మ్యాప్‌ను సిద్దం చేస్తున్నారు.
వైసీపీ చీప్ వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్నారు.ఈ మేరకు ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల్లో టిడిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయనున్నారు.
వైసీపీకి ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్‌ను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ప్రశాంత్‌కిషోర్ నివేదిక ఇవ్వనున్నారు.ఈ నివేదికల ఆధారంగా పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
గత ఎన్నికల సమయంలోనే చేసిన పొరపాట్లను ఈ దఫా చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీ రానున్న ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు అన్ని అస్త్రాలను ఆ పార్టీ ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

అన్ని జిల్లాల్లో పాదయాత్ర జరిగేలా రూట్‌మ్యాప్
ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర జరిగేలా వైసీపీ చీఫ్ జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ పాదయాత్రను ఆయన వేదికగా ఉపయోగించుకోనున్నారు.అంతేకాదు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 9 అంశాలను కూడ అదే సమయంలో ప్రజల వద్దకు తీసుకెళ్ళనున్నారు. ప్రతి గ్రామానికి ఈ ప్రచారం వెళ్ళేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగేలా రూట్‌మ్యాప్‌ను సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్లకు ఈ విషయమై సూచలను చేశారు వైసీపీ చీఫ్. ప్రతి జిల్లాకు యాత్ర సాగేలా సీనియర్లు పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను సిద్దం చేస్తున్నారు.
Recommended Video


ఇడుపులపాయ నుండే పాదయాత్ర
ఈ ఏడాది అక్టోబర్ 27వ, తేదిన వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్రను ఇడుపులపాయ నుండి ప్రారంబించనున్నారు. పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో ముగుస్తోంది. సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేయనున్నారు. కడప జిల్లా నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాతో ముగియనుంది. ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర సాగుతోంది. ఆయా జిల్లాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను కూడ జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

తిరుమలకు కాలికడక ద్వారానే
తిరుమలకు వైసీపీ చీఫ్ కాలికనడక ద్వారానే వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను తయారు చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా బిజెపి నేతలు జగన్ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాఖలో వైఎస్ విజయమ్మ పోటీ సందర్భంగా బిజెపి నేతలు చేసిన ఆరోపణలు కూడ ఆ స్థానంలో ఆమె ఓటమికి కారణమయ్యాయనే అభిప్రాయాలను రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత జగన్ తన వైఖరిలో మార్పు వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. గతంలో జగన్ తిరుమలను సందర్శించిన సమయంలో కూడ టిడిపి నేతలు విమర్శలు చేశారు. జగన్ అనుసరించిన పద్దతులను టిడిపి నేతలు తప్పుబట్టారు. అయితే ఈ దఫా పాదయాత్ర ద్వారా తిరుపతికి వెళ్ళనున్న జగన్ గతంలో చోటుచేసుకొన్న పొరపాట్లను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

అన్ని సెగ్మెంట్లకు పాదయాత్ర రాకపోవచ్చు
ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగినప్పటికీ ఆయా జిల్లాల్లోని అన్ని సెగ్మెంట్లకు పాదయాత్ర వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే పాదయాత్ర సాగని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ ఆ పార్టీ నాయతక్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేస్తోన్నట్టు సమాచారం. అయితే పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతోపాటు రానున్న ఎన్నికలకు సన్నద్దం చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications