‘ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు’

కడప: జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. పవన్ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ కార్యాదర్శి అంబకపల్లె నారాయణస్వామి, జిల్లా సంయుక్త కార్యదర్శి వీరభద్రారెడ్డి, చంద్రమౌళి అన్నారు.

స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. ఓటుకు నోటు గురించి స్పందించేందుకు ఆయన వారం రోజుల సమయం తీసుకోవడం.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులతో ట్యూషన్ చెప్పించుకోవడానికే ఉన్నట్లుందని ఆరోపించారు.

YSRCP leaders takes on Pawan Kalyan

రాష్ట్రంలో, కేంద్రంలో ఇన్ని జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా, నాలుక కోసుకున్నారా లేక అధికార పార్టీలకు అమ్ముడు పోయారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు ప్రశ్నించలేరన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మీరు చూడకపోతే, తెలియకపోతే తాము ప్రశ్నలు అందిస్తామని, తమ తరపున ప్రశ్నించాలన్నారు.

రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ వారా కాదా ? ఆడియో టేపులో ఉన్నది బాబు గొంతు కాదా? డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టవచ్చా? లంచంగా ఇవ్వజూపిన డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించరెందుకన్నారు. ఇకనైనా లెంపలేసుకొని రాజకీయ నటన మానుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+