కర్ణాటక రాజకీయాల్లో జగన్ గ్రాండ్ ఎంట్రీ - పోటీ పక్కా - చాప కింద గాలి
అమరావతి: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది మే నాటికి కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు కావాల్సి ఉంది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికోసం అధికార భారతీయ జనత పార్టీ, కాంగ్రెస్, జనతా దళ్ (సెక్యులర్) సమాయాత్తమౌతోన్నాయి. త్వరలోనే బెంగళూరులో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఖర్గె సొంత రాష్ట్రం..
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొత్తగా ఇటీవలే ఎన్నికైన మల్లికార్జున ఖర్గె సొంత రాష్ట్రం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తన సొంత రాష్ట్రంలో పార్టీని ఎలా గట్టెక్కించగలుగుతారనేది ఆసక్తి రేపుతోంది. దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ దెబ్బకు కుప్పకూలింది.

వైసీపీ ఎంట్రీ..
ఇప్పుడున్న ఈ మూడింటి మధ్య- కొత్తగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు వారు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ.. తన అభ్యర్థులను నిలబెడుతుందని చెబుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఏపీ నుంచి కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడిన నియోజకవర్గాలను టార్గెట్‌గా చేసుకుని వైఎస్ఆర్సీపీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి సహకారం..
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సహకారాన్ని వైఎస్ జగన్ తీసుకుంటారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్నారాయన. ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తరువాత గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఆయన సహకారాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందని సమాచారం.

పొరుగు జిల్లాల్లో..
తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపుతారని చెబుతున్నారు. బళ్లారితో పాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరుకు ఆనుకుని ఉన్న రాయచూరు, చిక్‌బళ్లాపుర, కోలార్ జిల్లాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.

కనీసం 20 నియోజకవర్గాల్లో..
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేలా వైఎస్ఆర్సీపీ వ్యూహాలను రూపొందించుకుంటోందని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ-గాలి జనార్ధన్ రెడ్డి మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగాయని చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ మంత్రి ఒకరు గాలి జనార్ధన్ రెడ్డితో మాట్లాడారని సమాచారం. కర్ణాటక రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల ఆయనకు ఈ బాధ్యతను అప్పగించారని చెబుతున్నారు.

ఈ నియోజకవర్గాల్లో..
రాయచూర్, సింధనూర్, దేవదుర్గ, బళ్లారి, సిరిగుప్ప, సండూర్, చెళ్లకెరె, చిత్రదుర్గ, హిరియూర్, పావగడ, మధుగిరి, బాగేపల్లి, చింతామణి, బాగేపల్లి, గౌరిబిదనూర్, ముళబాగలు, కోలార్.. వంటి తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే అంశాలను వైఎస్ఆర్సీపీ పరిశీలిస్తోందని సమాచారం.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications