Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరగబడిన వ్యూహం!: వైసీపీ మైండ్ గేమ్, దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్, టీడీపీకి కూడా

అమరావతి: తెలుగుదేశం పార్టీకి దూరం జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడిందా? దానిని జనసేనాని వెంటనే తిప్పికొట్టారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీపై గట్టి విమర్శలు చేయకుండా.. కేవలం నిలదీసినప్పుడల్లా వైసీపీ ఆయనపై చంద్రబాబు అనుకూల ముద్ర వేసింది.

టీడీపీపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు.. అధికార పార్టీ నేతలు జనసేనాని వెనుక బీజేపీ, వైసీపీ ఉందని విమర్శిస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడు కూడా తన వెనుక ఏ పార్టీ లేదని, తాను ప్రజల పక్షమని చెబుతూ వస్తున్నారు. అయితే, ఇటీవల వైసీపీ నేత వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనానికి తెరదీశాయి. దీంతో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పవన్‌పై ఉందన్నారు. పవన్ తన సమాధానంతో టీడీపీ నోరు కూడా మూయించారని అంటున్నారు.

Recommended Video

    విద్యార్థులకు పవన్ హితబోధ

    వరప్రసాద్ ఏం చెప్పారంటే

    వరప్రసాద్ ఏం చెప్పారంటే

    వైసీపీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వైసీపీతో కలిసేందుకు ప్రయత్నం చేసిన మాట వాస్తవమేనని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్ల పాలనలో చేసిన అవినీతి పవన్‌కు నచ్చలేదన్నారు. అందుకే పవన్ తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు జనసేన అధినేత సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిగతంగా శ్రమిస్తున్నారని, అందుకే ఆయనకే నా మద్దతు ఉంటుందని పవన్ చెప్పారని వ్యాఖ్యానించారు.

    ఇదీ వైసీపీ వ్యూహం

    ఇదీ వైసీపీ వ్యూహం

    అయితే వరప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ మరో మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. అయితే వైసీపీ వ్యూహాత్మకంగానే పవన్ పేరును తీసుకు వచ్చిందని చెబుతున్నారు. ఇది మైండ్ గేమ్ కావొచ్చునని అంటున్నారు. 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్నారనే భావ ప్రజల్లో కలిగించేందుకే ఈ ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో గుంటూరులో జరిగిన ఓ దైవ కార్యక్రమంలో చంద్రబాబుతోను పవన్ మాట్లాడారు.

    ఈ భేటీలు.. పవన్ స్పందన

    ఈ భేటీలు.. పవన్ స్పందన

    వైసీపీ నేతల వ్యాఖ్యలు, చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో.. పవన్ వెంటనే స్పందించారు. తాను రాజకీయ విభేదాలను సిద్ధాంతాలపరంగానే చూస్తానని, వ్యక్తిగతంగా చూడనని తేల్చి చెప్పారు. నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద అని, మా గత రాజకీ ప్రయాణం వల్ల నేను కలిసే నేతలైనా, విష్ చేసే నేతలైనా నేనేమిటో వారికి తెలుసునని, నా మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దన్నారు.

    టీడీపీతో పాటు వైసీపీ తగిలేలా

    టీడీపీతో పాటు వైసీపీ తగిలేలా

    పనన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు.. దైవకార్యక్రమంలో చంద్రబాబుతో కుశల ప్రశ్నల విషయంలో క్లారిటీ ఇచ్చినట్లుగా కనిపించినప్పటికీ, వైసీపీకి కూడా అది కౌంటర్ అంటున్నారు. ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీకి తగిలేలా ఆయన సమాధానం చెప్పారని అంటున్నారు. జగన్ అవినీతి కేసుల కారణంగా మద్దతివ్వని పవన్.. ఇప్పుడు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంతమాత్రాన ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతారనుకోవడం పొరపాటని, వ్యక్తిగతంగానే ముందుకు సాగుతారని లేదంటే లెఫ్ట్ పార్టీలతో కలిసి సాగుతారని అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+