వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడలకు దూరంగా వైసీపీ మంత్రుల బస్సుయాత్ర- బహిరంగసభలకే ప్రాధాన్యం-టార్గెట్ నెరవేరేనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూడేళ్లలో సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు అందించిన సంక్షేమాన్ని గుర్తుచేసేందుకు మంత్రులు బస్సు యాత్ర చేపట్టారు. సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు చేపట్టిన ఈ యాత్ర ఇవాళ రెండోరోజుకు చేరుకుంది. నిన్న యాత్ర ప్రారంభం తర్వాత అది సాగుతున్న తీరు చూస్తే ఎస్సీ వాడలకు దూరంగానే సాగిపోతోంది. వాడల్లోకి వెళ్లాల్సిన మంత్రులు బహిరంగసభలకు పరిమితం అవుతున్నారు. వాడల నుంచి తరలించే జనమే అక్కడ కనిపిస్తున్నారు. దీంతో యాత్ర ప్రయోజనం నెరవేరుతుందా లేదా అన్న దానిపై చర్చ సాగుతోంది.

వైసీపీ మంత్రుల బస్సుయాత్ర

వైసీపీ మంత్రుల బస్సుయాత్ర

ఏపీలో టీడీపీ మహానాడు జరుగుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో హడావిడిగా బస్సు యాత్రకు వైసీపీ మంత్రులు ప్లాన్ చేసారు. సీఎం జగన్ ఆదేశాలతో అప్పటికప్పుడు షెడ్యూల్ రూపొందించి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ బస్సు యాత్ర మొదలుపెట్టేశారు. ఆదరాబాదరాగా తయారు చేసిన షెడ్యూల్ ప్రకారం పలు ప్రాంతాల్ని చుట్టేస్తున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే బస్సులో కూర్చోవడం లేదంటే బహిరంగ సభల్లో వేదికపై కూర్చోవడమే మంత్రుల పనిగా మారింది.

ఎస్సీ వాడలకు దూరం

ఎస్సీ వాడలకు దూరం

రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశామని చెప్పుకుంటూ ఎస్సీ, బీసీ వర్గాల వద్దకు వెళ్తున్న మంత్రులు..వారు ఎక్కువగా నివసించే కాలనీలు, వాడల్ని మాత్రం టచ్ చేసేందుకు ఇష్టపడటం లేదు. బస్సు వెళ్లగలిగే మార్గాల్లోనే యాత్ర ప్లాన్ చేసిన మంత్రులు.. బస్సుల్లోనే వాడలకు దూరంగా ప్రయాణం సాగిస్తున్నారు. తొలిరోజు శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన యాత్రను గమనిస్తే ఎస్సీ వాడల్లో మంత్రులు నేరుగా దిగి వారిని పలకరిస్తున్న సందర్భాలు కనిపించడం లేదు. దీంతో సామాజిక న్యాయభేరి యాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 దాడుల భయంతో బహిరంగసభలు

దాడుల భయంతో బహిరంగసభలు

ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారిని నేరుగా వారి వాడలకు వెళ్లి పలకరించడం సాధ్యం కాదనే వాస్తవాన్ని వైసీపీ మంత్రులు గ్రహించినట్లే కనిపిస్తోంది. దీంతో నేరుగా బహిరంగసభలే పెట్టి ఎస్సీలు, బీసీల్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో బహిరంగసభలకు జనం తరలింపు ఎలా ఉంటుందో తెలియందేముంది. దీంతో బహిరంగసభలకు వస్తున్న జనం సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. ఇఫ్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడంతో జనం ఈ సభలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది.

సామాజిక లక్ష్యం నెరవేరేనా ?

సామాజిక లక్ష్యం నెరవేరేనా ?


ఇధే పరిస్ధితి కొనసాగితే వైసీపీ మంత్రుల బస్సు యాత్ర సామాజిక న్యాయ భేరి ప్రయోజనం నెరవేరుస్తుందా అనే చర్చ మొదలైంది. వైసీపీ మంత్రులు అట్టహాసంగా ప్రారంభించిన యాత్రకు అర్బన్ ప్రాంతాల్లో కొంత మేర ఆదరణ లభిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్ధితి దారుణంగా ఉంటోంది. దీంతో మంత్రులు ప్రధాన ప్రాంతాల్లో బహిరంగసభలవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాజమండ్రి మున్సిపల్ మైదానంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు.ఇలా ఎస్సీ వాడల్ని, బీసీ కాలనీల్ని విస్మరించి మొక్కుబడిగా వైసీపీ మంత్రులు యాత్ర పూర్తి చేస్తే దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటన్నది అధిష్టానమే ఆలోచించాల్సి ఉంటుంది.

English summary
ysrcp ministers bus yatra continues on second day today in several districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X