ప్యాకేజీస్టార్ పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు కానీ చంద్రబాబు చుట్టూ: విరుచుకుపడిన వైసీపీ మంత్రులు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులపై నా ఆసక్తికర చర్చ జరుగుతుంది. తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఏపీ అధికార పార్టీకి ఏమాత్రం రుచించడం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తాజా భేటీపై వైసీపీ మంత్రులు నేతలు వరుసగా మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని, పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ని టార్గెట్ చేస్తున్నారు.

పవన్ డబ్బు కోసం దిగజారిపోయాడు.. అందుకే చంద్రబాబును కలిశాడు: మంత్రి సీదిరి అప్పలరాజు
చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తన రేటు పెంచుకోవడం కోసమే చంద్రబాబును కలిశాడని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు గుప్పించారు. శ్రీకాకుళంలో జరిగే సభ స్క్రిప్ట్ కోసం చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను కలిశారని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. పవన్ డబ్బు కోసం దిగజారి పోయాడని, తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.

పవన్ చంద్రబాబుల భేటీపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలవటంలో ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ లకు లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఏ ఉద్దేశంతో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను కలిశారో చెప్పాలని.. సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఆ రెండు పార్టీలకు ఉంటే చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. నీచ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ అలవాటు పడ్డాడని, పవన్ మాట్లాడే ప్రతి మాటకు ఒక రేటు ఉంటుంది అంటూ మంత్రి శ్రీధర్ అప్పల రాజు ఎటాక్ చేశారు.

బీజేపీతో పొత్తు కానీ చంద్రబాబు చుట్టూ .. మంత్రి దాడిశెట్టి రాజా అసహనం
మరోవైపు కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ పై తీవ్రంగా స్పందించారు. వారిద్దరి భేటీని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని దాడిశెట్టి రాజా తేల్చిచెప్పారు. పవన్ ఒక ప్యాకేజ్ స్టార్ అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు చెప్పాలని మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక స్వార్థ ప్రయోజనాల కోసమేనని మంత్రి దాడిశెట్టి రాజా తేల్చిచెప్పారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలో 11 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పై వంగా గీత అసహనం
మరోవైపు వైసీపీ వంగా గీత కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల భేటీ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఎవరినైనా కలవ వచ్చని, కానీ స్వార్థ ప్రయోజనాల కోసమే కలవడం తప్పని వంగ గీత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరిని కలిసినా తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వంగా గీత పేర్కొన్నారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్ధిస్తున్నారని, ఆయనకే మద్దతిస్తున్నారని వంగ గీత అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications