త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలు
అమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్నారు. అమరావతి పెద్ద స్కామ్ అని తాము ముందునుంచి చెప్తున్నామని, బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని రాంబాబు తెలిపారు.. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందని, త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని అంబటి తెలిపారు.
రాజధాని భూముల స్కామ్‌పై సీబీఐ విచారణ వేయాలని కేంద్రాన్ని కోరామని, టీడీపీ తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ కోరాలని అంబటి రాంబాబు సూచించారు. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదన్నారు. అలాగే ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని అంబటి తెలిపారు.. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలన్నారు. ఈ రెండు కేసులూ తీవ్రమైనవని అంబటి పేర్కొన్నారు. వీటిపై సీబీఐ విచారణ తప్పనిసరన్నారు. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టేనని అంబటి వ్యాఖ్యానించారు.

హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి స్పందించారు. డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. న్యాయస్థానాలపై తమకు ఎంతో గౌరవం ఉందని, హైకోర్టు కామెంట్స్‌పై సమాధానం చెప్పలేమన్నారు. కేవలం హైకోర్టు ఉత్తర్వులపై మాత్రం స్పందిస్తామన్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications