విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జంప్: కొత్తపల్లి గీతపై జగన్ పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

 YSRCP MLA complains against Geetha
హైదరాబాద్: పార్టీ మారడానికి ప్రయత్నిస్తూ, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విశాఖపట్నం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోరాటం ప్రకటించినట్లే ఉంది. కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున అరుకు నుంచి ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోది. పార్టీలో తనకు అవమానం జరుగుతోందని, ఈ విషయంపై తాను జగన్‌కు చెప్పానని, జగన్ పిలిస్తే వెళ్లి మాట్లాడుతానని, లేదంటే తాను వెళ్లబోనని చెప్పారు. ఈ స్థితిలో ఆమెపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కత్తి కట్టినట్లు కనిపిస్తోంది.

గీత నామినేషన్ దాఖలు చేసే సమయంలో తప్పుడు ధ్రువపత్రాలు జత చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఈశ్వరి ఆరోపించారు. కొత్తపల్లి దీత ఎస్టీ కాదంటూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈశ్వరి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు.

తాను తెలుగుదేశం పార్టీలో చేరబోనని చెబుతూనే కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని నిరూపించడానికి ఎంత దూరమైన వెళ్తామని ఈశ్వరి అన్నారు. తమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గిరిజనులకు సముచిత స్థానం లేదనే విమర్శల్లో నిజం లేదని ఆమె అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి కొత్తపల్లి గీత మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆమె సవాల్ చేశారు. గిరిజనులు కించపరిచే విధంగా గీత వ్యవహరిస్తున్నారని తప్పు పట్టారు

English summary
YSR Congress party MLA Eswari made complaint against Araku MP Kothappali Geetha to Bhanwarlal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X