తుని రైలు దహనం కేసు: వైసీపీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంసం ఘటన కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు అంగీకరించింది. తునిలో జరిగిన రైలు విధ్వంసం కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ తనపై కూడా ప్రభుత్వం కేసు పెట్టిందంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.

ప్రభుత్వం తనపై ఎటువంటి విచారణకు ఆదేశించకుండా తనపై తప్పుడు కేసు పెట్టిందని, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు. దాడిశెట్టి రాజా పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, రాజాకు ముందస్తు బెయిల్ మంజారు చేశారు.

Ysrcp mla Dadisetty Raja gerts advance bail in tuni incident

ఇదిలా ఉంటే తుని విధ్వంసం ఘటనలో రాజాకు సంబంధం ఉందంటూ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించడం విశేషం. కాగా, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి, ప్రస్తుతం ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీకి చెందిన దాడిశెట్టి రాజా 18,573 ఓట్ల తేడాతో గెలుపొందారు.

అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు మాతృ వియోగం

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(84) గురువారం తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా పి.నరసాపురం మండలంలోని ఆమె స్వగ్రామం మర్రిగూడెంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మర్రిగూడెం బయల్దేరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp mla Dadisetty Raja gets advance bail in tuni incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి