జగన్‌ను వేడుకున్నా కనికరించలేదు, గెంటేశారు: గిడ్డి ఈశ్వరి షాకింగ్
టీడీపీలో చేరిన అనంతరం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుత
అమరావతి: టీడీపీలో చేరిన అనంతరం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Recommended Video


జగన్‌పై వ్యాఖ్యలు
వైసీపీని వీడుతున్న నేతలు జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు గిడ్డి ఈశ్వరి కూడా అలాగే మాట్లాడటం గమనార్హం. దీంతో ఈ వ్యాఖ్యలు వైసీపీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జగన్‌ను నమ్మాను కానీ
జగన్ అంటే తనకు ఎంతో ప్రేమ అని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిగా ఎంతో విధేయతతో పని చేశానని గిడ్డి ఈశ్వరి అన్నారు. జగన్‌ను తాను ఎంతగానో నమ్మానని ఆమె అన్నారు.
కానీ తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారన్నారు.

మాకు అన్యాయం చేయొద్దని వేడుకున్నా
మాకు అన్యాయం చేయవద్దని జగన్‌ను వేడుకున్నానని, కానీ ఆయన కనికరించలేదని గిడ్డి ఈశ్వరి అన్నారు. తమను పార్టీ నుంచి గెంటివేశారని వెల్లడించారు. స్థానికేతరుడికే టిక్కెట్ ఇస్తానని ఖరాఖండిగా చెప్పేశారని వ్యాఖ్యానించారు.

టిక్కెట్ అడిగితే రూ.25 కోట్లకు అమ్ముడుపోయావని అపవాదు
తాము టిక్కెట్ అడిగితే తమపై అపవాదు వేశారని గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. తాను రూ.25 కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయినట్లు ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరులో వైసీపీ ఖాళీ అయిందని తెలిపారు.

ఈశ్వరి వ్యాఖ్యలపై చర్చ
జగన్ మమ్మల్ని కనికరించలేదని, పార్టీ నుంచి గెంటేశారని, తనను రూ.25 కోట్లకు అమ్ముడుపోయావని ఆరోపించారని గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వైసీపీకి ముందే తెలిసి
కాగా, విశాఖ జిల్లా వైసీపీ నేత కరణం ధర్మశ్రీ ఆదివారం సాయంత్రం పాడేరులోని ఈశ్వరి ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. బుజ్జగించినా ఈశ్వరి తగ్గలేదు. అనంతరం ధర్మశ్రీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అందుకే ఈశ్వరి అసంతృప్తి అని వైసీపీ నేత
గిడ్డీ ఈశ్వరి పార్టీ మారుతున్నట్టు పత్రికల్లో చూసి వచ్చానని, ఆమె పార్టీ మారుతున్నట్టు తనకేమీ చెప్పలేదని ధర్మశ్రీ తెలిపారు. వైసీపీ నాయకత్వం పట్ల ఈశ్వరి కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారని, అరకు నియోజకవర్గంలో తాను సూచించిన నాయకుల్ని కాకుండా, వేరే వారిని పార్టీ ప్రోత్సహించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు హామీ
టిడిపిలో చేరిన సమయంలో గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగన్ వ్యవహారశైలి నచ్చలేదని, తన అత్మాభిమానం దెబ్బతిన్నదన్నారు. ఇదిలా ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోను పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications