బాలకృష్ణ మెంటల్-అసెంబ్లీకి రానివ్వొద్దన్న వైసీపీ ఎమ్మెల్యే..గన్ తో కాల్చేస్తే..?
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై చంద్రబాబు అరెస్టు ప్రభావం తీవ్రంగా పడుతోంది. చంద్రబాబు అరెస్టుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానాలు ఇస్తున్నా స్పీకర్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలకు దిగడం, సస్పెండ్ కావడం జరుగుతూనే ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు కూడా ఏకపక్షంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. అదే సమయంలో బాలకృష్ణ విజిల్స్, వైసీపీ ఎమ్మెల్యేల సెటైర్స్ కొనసాగాయి.
చంద్రబాబు అరెస్టుపై చర్చకు వాయిదా తీర్మానాలు తిరస్కరించడం, నిన్న సభలో పరిణామాలపై సీఎం జగన్ క్షమాపణ కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానం సైతం తిరస్కరించడంతో ఇవాళ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో విజిల్ తెచ్చి ఊదడం, దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి బాలయ్య తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

బాలకృష్ణకు మెంటల్ అని, సభకు రానివ్వొద్దని వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కోరారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మధుసూదన్ మండిపడ్డారు. చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని, పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారని ఆయన తెలిపారు. మెంటల్గా ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దని స్పీకర్ ను ఆయన కోరారు. మనల్ని గన్తో కాల్చినా కేసులుండవన్నారు. టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ హాస్పిటల్ కు పంపించండని సభను కోరారు.












Click it and Unblock the Notifications