ఎట్టకేలకు తగ్గిన రోజా, అనితకు క్షమాపణ.. ట్విస్ట్: బంతి స్పీకర్ చేతిలో..

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా ఎట్టకేలకు తగ్గారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు బుధవారం నాడు క్షమాపణలు చెప్పారు. సభలో తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని, రోజా చెప్పారు.

నన్ను టార్గెట్ చేశారు

రోజా బుధవారం మధ్యాహ్నం ఏపీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రివిలేజ్ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్యే రోజా మధ్య వాడిగా, వేడిగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందులో మీ పైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయని చైర్మన్ అన్నారు.

దానికి రోజా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రధానంగా తనను టార్గెట్ చేసిందని, అందుకే తాను ఏం చేసినా తప్పులు పట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె చెప్పారని తెలుస్తోంది. నేను సభలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరి పట్ల అనుచిత సైగలు చేయలేదని, ఎమ్మెల్యే అనిత పట్ల అనుచితంగా వ్యవహరించలేదని చెప్పారు.

అనితను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అలా చేశానని భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటానని రోజా చెప్పారు. తాను అసెంబ్లీలో రిషికేశ్వరి, కాల్ మనీ వ్యవహారం విషయమై పోరాడానని రోజా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

YSRCP MLA roja apology to TDP MLA Anitha

ఎట్టకేలకు తగ్గిన రోజా

సభలో రోజా వ్యవహార శైలి పైన.. రోజా, చైర్మన్ మధ్య దాదాపు గంటన్నర పాటు చర్చ జరిగిందని, కాసేపు ఇరువురి మధ్య వాదన కూడా జరిగిందని తెలుస్తోంది. ఆ తర్వాత ఎట్టకేలకు రోజా తగ్గారు.

తనను టిడిపి లక్ష్యంగా చేసుకుందని, అధికార పార్టీ వాళ్లే తనను రెచ్చగొట్టారని రోజా ఈ సందర్భంగా చెప్పారు. అదే సమయంలో తన వ్యాఖ్యలకు అనిత బాధపడి ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నట్లు రోజా చెప్పారు. అయితే, సభలో తనను టార్గెట్ చేయడాన్ని ఆమె చైర్మన్.. ఎదుట ప్రస్తావించారు. అనిత పట్ల కూడా తాను తోటి సభ్యులతో వ్యవహరించినట్లే వ్యవహరించానని, ఒకవేళ బాధపడి ఉంటే సారీ చెప్తున్నానని అన్నారు.

రోజా క్షమాపణ చెప్పారు: బండారు

సభలో తన వైఖరికి రోజా క్షమాపణ చెప్పారని ప్రివిలేజ్ సభ్యుడు బండారు అన్నారు. ఆమె వివరణను నమోదు చేసుకున్నామని చెప్పారు. దీనిని తాము స్పీకర్‌కు అందిస్తామని చెప్పారు. రోజా చెప్పిన విషయాలను స్పీకర్ కోడెల శివప్రసాద రావు దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.

ట్విస్ట్ ఏమంటే... అనితను తాను అలా అనలేదని, అలా భావిస్తే మాత్రం తాను క్షమాపణ చెబుతున్నానని రోజా చెప్పారు. దీనిని కమిటీ సభ్యులు మాత్రం.. తప్పు చేసినందువల్లే క్షమాపణ చెప్పినట్లుగానే భావిస్తున్నారని చెప్పవచ్చు.

ఆ మాటేమిటి?

అనితకు రోజా క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. ఆమెను అధికార పార్టీ క్షమించి వదిలేస్తుందా లేక చర్యలకు ఉపక్రమిస్తుందా అనే చర్చ సాగుతోంది. మరోవైపు అనితకు సారీ చెప్పిన రోజా.. చంద్రబాబు, స్పీకర్ కోడెల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారని దాని మాటేమిటనే వాదన తెరపైకి రావొచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+