చెవిలో పూలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా నిరసన ర్యాలీ, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చనందుకు నిరసనగా చెవిలో పూలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా వినూత్నంగా నిరసన తెలిపారు. పుత్తూరు పట్టణంలో ఆరేటమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ఆమె బుధవారం ర్యాలీ నిర్వహించారు.

మగాడినై రెచ్చిపోతా, నన్ను కట్ చేస్తే ఏపీనే కట్ చేస్తా: మాణిక్యాలరావు సంచలనం

జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు పాలన అంతం కావాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అథ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు.

Ysrcp Mla Roja variety protest launches at Puttur

జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, అమర్‌నాధ్‌రెడ్డిలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు కల్పించలేని అసమర్థులని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం చంద్రబాబు యువతకు అన్యాయం చేస్తున్నారని రోజా విమర్శించారు.

చచ్చినా వైసీపీలో చేరను, ఆత్మాభిమానం చంపుకోలేను: ఎంపీ కొత్తపల్లి గీత

కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా సుమారు 25 వేల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను వీధిన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా హామీని ఓటుకు నోటు కేసుతో తాకట్టు పెట్టి యువత ఆశలకు సజీవ సమాధి కట్టిన బాబు పాలనకు చరమ గీతం పాడేందుకు యువత ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp Mla Roja variety protest conducted on wednesday at Puttur against Tdp government. chandrababu naidu not implemented his election promises said mla roja.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి