కర్నూలు ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు పడ్డారు: కొత్త కారుని ఎత్తుకెళ్లారు
అమరావతి: కర్నూలు ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇటీవల ఆయన ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన కొత్త స్కార్పియో కారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... రెండు రోజుల స్కార్పియో కారును ఆయన కొనుగోలు చేశారు.
కర్నూలులోని ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన ఆ కొత్త కారును గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ఎత్తుకెళ్లారు. కారుతో పాటు అందులో పెట్టిన సూట్ కేసు, అందులోని రూ.23 వేల నగదు, సీసీటీవీ రికార్డర్ ను కూడా ఎత్తుకెళ్లారు.

కారు చోరీకి గురైందని తెలుసుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కారుతో పాటు దొంగలు ఎత్తుకెళ్లిన నగదు, సీసీ టీవీ రికార్డర్‌ను కూడా ప్రస్తావించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు కోసం ముమ్మర గాలింపు ప్రారంభించారు.
సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన కారు చోరీకి గురికావడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. కాగా కర్నూలు జిల్లా ఎస్పీ ఎ. రవికృష్ణ నివాసానికి కూతవేటు దూరంలోనే ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నివాసం ఉంది. ఇటీవల కాలంలో కర్నూలు పట్టణంలో చోరీలు బాగా జరుగుతున్నాయి.
చైన్ స్నాచింగ్‌లు కూడా ఎక్కువయ్యాయి. చోరీలపై నగర ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications