నేను తప్పు చేశా క్షమించండి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.చిప్పగిరిలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో సీతమ్మ వారి మెడలో తాళి కట్టారు.సాధారణంగా శ్రీరామ కళ్యాణోత్సవంలో అర్చకులు మాత్రమే సీతమ్మ వారికి తాళి కడతారు. అయితే, ఈసారి ఎమ్మెల్యే స్వయంగా తాళి కట్టడం వివాదాస్పదమైంది. ఈ చర్యను చాలా మంది హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధమంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భక్తులు ఎమ్మెల్యే చేపిన చర్య సరైంది కాదని విమర్శిస్తున్నారు. వివాదం పెద్దది కావడంతో ఎమ్మెల్యే వీరూపాక్ష సోషల్ మీడియా వేదికగా హిందువులందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పారు.శ్రీరామ నవమి సందర్భంగా తాను కేవలం ఒక భక్తుడిలా మాత్రమే వెళ్లాను కానీ మరో ఉద్దేశంతో కాదు, పూజలో కూడా కేవలం అర్చకులు చెబితేనే తాళిబొట్టు వేశాను కానీ నా సొంతంగా ఏ పని చేయలేదు అంటూ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడం జరిగింది.

YSRCP MLA Virupakshi apologizes to devotees

2024లో జరిగిన ఎన్నికల్లో విరుపాక్షి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024లో జరిగిన ఎన్నికలలో టీడీపీ తరుపున అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందినా, ఆలూరు నియోజకవర్గంలో మాత్రం వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి వీరూపాక్ష గెలుపొందారు.టీడీపీ తరుపున బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే వీరభద్ర గౌడ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+