కడప ఓటమి ఎఫెక్ట్, జగన్-వైసిపి ఢీలా: 'టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు.. టచ్‌లో'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో టచ్‌‌లో ఉన్నారని, త్వరలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరుతారని టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.

అమరావతి/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో టచ్‌‌లో ఉన్నారని, త్వరలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరుతారని టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.

ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ ఎమ్మెల్సీ సీటు గెలవడం తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మకమన్నారు.

YSRCP MLAs may join Telugudesam Party soon

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో కామన్ మ్యాన్ బీటెక్‌ రవిని బరిలోకి దింపి ఘన విజయం సాధించామని చెప్పారు. ఈ విజయం సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌లకు ఉగాది కానుకగా ఇచ్చామన్నారు.

ఇదిలా ఉండగా, వైసిపి అధినేత జగన్, వైసిపి నాయకుల అతి విశ్వాసం వల్లే కడపలో వైయస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారని టిడిపి నేతలు అంటున్నారు. కడపలో ఓటమితో వైసిపి ఢీలో పడిందని చెబుతున్నారు. ప్రత్యర్థి వ్యూహాలను వైసిపి పసిగట్టలేకపోయిందని చెప్పారు.

కాగా, కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన 38 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

తద్వారా మూడున్నర దశాబ్దాల తర్వాత వైయస్ ఇలాకాలో టిడిపి సత్తా చాటింది. కడపలో వైసిపికి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు పునరాలోచన చేస్తున్నారని, టిడిపిలోకి వస్తారని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+