వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో తోటి ఖైదీపై ఎమ్మెల్సీ అనంతబాబు దాడి ? సకల మర్యాదలు-ములాఖత్ ల మధ్య

|
Google Oneindia TeluguNews

సొంత కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైల్లో హల్ చల్ చేస్తున్నారు. హత్య కేసులో జైల్లో ఉన్న ఆయనకు ప్రభుత్వం ఇప్పటికే అతిధి మర్యాదలు చేస్తుండగా.. తాజాగా ఆయనకు వివిధ పేర్లతో అపరిమితంగా ములాఖత్ లు కూడా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయన తన తోటి ఖైదీపై దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది.

 జైల్లో ఎమ్మెల్సీ అనంతబాబు

జైల్లో ఎమ్మెల్సీ అనంతబాబు

కారు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని దారుణంగా హతమార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు హత్య కేసులో మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు.. జైల్లో ప్రవర్తిస్తున్న తీరు, ఆయనకు లబిస్తున్న మర్యాదలు, ములాఖత్ లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

 జైల్లో తోటి ఖైదీపై దాడి ?

జైల్లో తోటి ఖైదీపై దాడి ?

రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు.. తన తోటి ఖైదీపై తాజాగా దాడి చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కారణంతో ఆయన తన తోటి ఖైదీపై చేయి చేసుకున్నట్లు సమాచారం. దీనిపై జైలు అధికారులు బయటికి వివరాలు చెప్పకపోయినా దాడి జరిగినట్లు మాత్రం గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఏదో విషయంలో తోటి ఖైదీతో మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జైల్లో ఉన్న ఖైదీలకు చికిత్స చేయాలంటే ఆస్పత్రిలో వారిపై చిన్న గీత కూడా ఉండకూడదు. కానీ ఇక్కడ ఆయన తోటి ఖైదీకి ఈ దాడిలో చికిత్స చేయించుకునేంత దెబ్బలు తగల్లేదనే ప్రచారం జరుగుతోంది.

జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్

జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ జైలుకు వచ్చిన రెండో రోజే పరుపు ఏర్పాటు చేయడంతో పాటు ఆయన కోరిన ఆహారం కూడా బయటి నుంచి తెప్పించి ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ముగ్గురు ఖైదీల్ని ఒక్కో గదిలో ఉంచాల్సి ఉండగా.. అనంతబాబుకు మాత్రం విడిగా గది కేటాయించారు. అలాగే ఆయనకు అపరిమితంగా ములాఖత్ లు కూడా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఆయన కుటుంబ సభ్యుల్ని మాత్రమే ములాఖత్ లకు అనుమతించాల్సి ఉండగా.. ఇప్పటికే రంపచోడవరం ఎమ్మెల్సే ధనలక్ష్మితో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు ఆయన్ను తరచూ కలుస్తున్నట్లు సమాచారం.

English summary
ysrcp mlc ananthababu is having vip treatment in rajamahendravaram jail and recently he attacked his jail mate alos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X