వైసీపీకి మరో షాక్- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..! నందిగం సురేష్ కు రిమాండ్..
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపక్ష వైసీపీకి ఇవాళ రెండో షాక్ తగిలింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిన్న రాత్రి మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. ఆయన్ను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ఇదే కేసులో అరెస్టు అయ్యారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్ తో పాటు పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వీరిని అరెస్టు చేసేందుకు 12 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు అయ్యాయి. దీంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వీరిలో నందిగం సురేశ్ ను రాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకొచ్చి ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలిస్తున్నారు. ఇవాళ అరెస్టు చేసిన లేళ్ల అప్పిరెడ్డిని సైతం మంగళగిరి పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరబోతున్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ రాత్రికి వీరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications