ఉచిత బస్సేదీ ? నిరుద్యోగ భృతెక్కడ ? బడ్జెట్ పై వైసీపీ ఫైర్..!

ఏపీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్దాయి బడ్డెట్ పై వైసీపీ మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీలా ఉందని వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తడానికే ఈ బడ్జెట్ తెచ్చినట్లు ఉందన్నారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా, అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ ను ఆత్మస్తుతి-పరనిందతో ముగించారని ఆరోపించారు.

గత ప్రభుత్వాన్ని దూషిస్తూ,సీఏం, ఆయన తనయుడిని ప్రశంసలతో ముంచెత్తుతూ... కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. చట్టసభల్లో సభ్యుడుగా సుదీర్ఘ అనుభవం ఉందని, ఎప్పుడూ ఇలా పొగడ్తలతో బడ్జెట్ ను ముంచేయడం చూడలేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సంప్రదాయం కొత్తగా ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు ఇన్నిసార్లు చంద్రబాబు, లోకేష్ లను పొగిడారో అర్ధం కాలేదన్నారు. ఎన్నికల హామీలపై మాత్రం కేటాయింపులు లేవన్నారు.

ysrcp mlcs slam state budget for ignoring welfare promises like free bus stipend and others

ప్రభుత్వం ప్రజలను మళ్ళీ మోసం చేసిందని, సూపర్ సిక్స్ అంటూ గొప్పగా ప్రజలను నమ్మించారని బొత్స ఆరోపించారు.
మహిళలకు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15వేలు, నిరుద్యోగులకు రూ.3000 భృతి, రైతులకు రూ.20వేల భరోసా అన్నారు కానీ వాటికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్ధులు ఉన్నారని,
వారికి తల్లికి వందనం ఇవ్వాలంటే దాదాపు రూ.12వేల కోట్లు అవసరమన్నారు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం రూ.9,400 కోట్లు మాత్రమే అన్నారు.

రాష్ట్రంలో కింద 52 లక్షల మందికి మా ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చామని,ఇవాళ అంతమందికి ఇరవై వేల చొప్పున సుమారు రూ.12వేల కోట్లు అవసరమని బొత్స తెలిపారు. కానీ బడ్జెట్ లో కేటాయించింది నామమాత్రమే అన్నారు. మహిళలకు అట్టహాసంగా ఉగాది నుంచి ఉచిత బస్సు అన్నారని, దీనిపై ఎక్కడా ప్రస్తావనే లేదన్నారు. ఇక మూలధన వ్యయంపై పొంతన లేకుండా చూపించారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో రూ.3000 కోట్లు మార్కెట్ ఇంట్రవెన్షన్ కింద నిధిని ఏర్పాటు చేసి, రైతులను ఆదుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారని,ఇదేనా రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ప్రేమ అని ప్రశ్నించారు.

బడ్జెట్లో ఉత్పాదక రంగానికి కేటాయింపులు లేవని మరో వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం మహిళలను వంచించిదని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలిపారు. సంక్షేమానికి కేటాయింపులు ఏవని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. 3వ తేదీన వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు బయటపెడతామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+