కాంగ్రెస్ లోకి వైసీపీ ఎంపీ ? ఖర్గేతో భేటీ..! ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ..!
ఏపీలో గతేడాది అధికారం కోల్పోయిన తర్వాత విపక్ష వైసీపీకి ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెప్పేసి కూటమిలో చేరిపోతున్నారు. ఇలాంటి వేళ మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి బీజేపీ, టీడీపీలో చేరిపోతుండగా.. ఇప్పుడు అనూహ్యంగా మరో ఎంపీ కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఢిల్లీలో భేటీ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఖార్గేకు పూలగుచ్చం ఇస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు మద్దతిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకున్న వేళ ఆయన ప్రత్యర్ధిగా నిలబడిన తెలుగువ్యక్తి సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ ను అదే పార్టీ ఎంపీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతేడాది ఫిబ్రవరిలో వైసీపీ తరఫున మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం మరో ఐదేళ్లు ఉంది. ఇలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీకి పార్లమెంట్ లో ఉన్న మొత్తం 11 మంది ఎంపీల్లో నలుగురు పార్టీని వీడారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి ఉన్నారు.
మరో ఎంపీ మిథున్ రెడ్డి మద్యం స్కాం కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. మరో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో రేపోమాపో బెయిల్ రద్దు అయితే జైలుకు వెళ్లక తప్పదు. ఈ నేపథ్యంలో మిగిలిన ఐదుగురు ఎంపీల్లో ఒకరైన మేడా రఘునాథ్ రెడ్డి ఇలా కాంగ్రెస్ బాస్ ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వైసీపీ ఇప్పటివరకూ స్పందించలేదు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications