పెద్దిరెడ్డి అడవి కబ్జా ? హెలికాఫ్టర్ నుంచి పవన్ వీడియో-మిథున్ రెడ్డి కౌంటర్..!

గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళం పేట అడవుల్లో అటవీ భూమిని ఆక్రమించుకున్న వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ నుంచి వీడియో తీసారు. తాజాగా చిత్తూరు అడవుల్లో పర్యటించిన పవన్.. అక్కడ టూర్ కు వెళ్లిన సందర్భంగా స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోను ఎడిటింగ్ చేసి ఇవాళ విడుదల చేశారు. ఈ వీడియో కలకలం రేపుతుండటంతో పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన తూర్పు కనుమలలోని రక్షిత మంగళం పేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణలు జరిగినట్లు ప్రత్యేక ఏరియల్ సర్వేలో వెల్లడైందంటూ పవన్ ఇవాళ వెల్లడించారు. తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఉల్లంఘనలను సమీక్షించానన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, క్యాబినెట్ మంత్రులకు సమాచారం అందించానన్నారు. అలాగే వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించారు.

ysrcp mp Mithun Reddy Hits Back at Pawan Kalyan Over Forest Land Encroachment Allegations

అడవి భూమిని లాక్కున్న ఎవరికైనా మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. భూమి రికార్డులలోని వ్యత్యాసాలు, పెంచిన వెబ్‌ల్యాండ్ ఎంట్రీలు, రక్షిత అటవీ ప్రాంతాలలో "పూర్వీకుల భూమి" అనే తప్పుడు వాదనలతో సహా దర్యాప్తు చేయాలన్నారు. పారదర్శకత, అటవీ భూములు జాతీయ ఆస్తులన్నారు. వాటిని ఆక్రమించినా, దుర్వినియోగం చేసినా, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారెవరైనా సరే, వారికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రక్షిత అటవీ ప్రాంతాలు లేదా వన్యప్రాణుల మండలాలను లాక్కోవడాన్ని ప్రభుత్వం సహించదన్నారు.

ysrcp mp Mithun Reddy Hits Back at Pawan Kalyan Over Forest Land Encroachment Allegations

దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మిస్టర్ పవన్ కళ్యాణ్.. మీరు షూటింగ్ మరియు స్కూటింగ్‌లో నిష్ణాతులు అన్నారు. గతంలో ఎర్రచందనం దొంగలంటూ ఆరోపణలు చేశారని, కానీ తాను నిరూపించమని అడిగితే పారిపోయారని గుర్తుచేశారు. మీరు మీ హెలికాప్టర్ నుండి షూట్ చేసింది తమ చట్టబద్ధమైన భూమి అని, తాము దానిని 2000 సంవత్సరంలో కొనుగోలు చేసామని మిథున్ రెడ్డి తెలిపారు.

2000 సంవత్సరంలో తాము అధికారంలో లేమని, నువ్వు అమాయకుడివి లేదా నా కుటుంబం పట్ల ద్వేషంతో నిండి ఉన్నావని పవన్ కు తెలిపారు. దయచేసి నీ ఆరోపణలను నిరూపించగలవా లేదా క్షమాపణ చెబుతావా? అని ప్రశ్నించారు. ఆ భూమి వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉన్న పత్రం. ఎవరైనా దానిని పొందవచ్చు. దయచేసి ముందుగా వాటిని పరిశీలించాలన్నారు. గతంలో విచారణలు జరిగాయని, ఎటువంటి చట్టవిరుద్ధమైన ఉల్లంఘనలు జరగలేదని నిరూపించబడ్డాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+