వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవో 217పై వైసీపీ ఎంపీ మోపిదేవి వ్యాఖ్యలు-ఉరి కాదు మత్సకారుల జీవితాల్లో వెలుగు

|
Google Oneindia TeluguNews

ఏపీలో మత్సకారుల అభ్యున్నతి కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, వాటిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంపై ఇవాళ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు స్పందించారు. మత్సకారుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే విపక్ష టీడీబీ, బీజేపీ మాత్రం దళారుల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ, వారికి మరింత మేలు చేకూరేలా నిర్ణయాలు చేస్తుంటే, టీడీపీ-బీజేపీ నేతలు ఉరి అంటూ.. గోబెల్స్ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులతో పాటు యావత్తు బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఇంతకాలం మత్స్యకార సొసైటీ సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలు ఆదాయం మాత్రమే ఉన్న చెరువులకు సంబంధించి.. మత్స్యకారుల ఆదాయం రూ. 15 వేల వరకు పెరిగేలా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు.

ysrcp mp mopidevi venkata ramana hails ap governments g.o 217, says it brightens fishermen lives

వంద హెక్టార్లు, ఆ పైన ఉన్న చెరువుల నిర్వహణ పేరుకు మాత్రమే మత్స్యకార సొసైటీల పరిధిలో ఉంటుందని, పెత్తనం అంతా దళారులదేనని మోపిదేవి స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 217 జీవో ద్వారా, నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 27 చెరువులను బహిరంగ వేలం ద్వారా ఇస్తే ప్రతిపక్షాలు ఎందుకు రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. అంటే, ప్రతిపక్షాలు మత్స్యకారులకు అనుకూలమా.. లేక వ్యతిరేకమా అని మోపిదేవి సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, దానికి ఉప కులాలుగా ఉన్న మత్స్యకార వర్గాలు, చెరువుల మీద ఆధారపడి జీవించే వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మోపిదేవి అన్నారు. ఆ కుటుంబాలకు అన్నివిధాలా న్యాయం చేయాలని నెల్లూరు జిల్లాను ఒక పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని, నూతన విధానం ద్వారా వచ్చే లాభ, నష్టాలను బేరీజు వేసుకుని అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జీవో నంబరు.217ను తీసుకురావడం జరిగిందన్నారు.. నెల్లూరు జిల్లాను పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని 27 ట్యాంకులకు ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా వెళ్ళామన్నారు.
దీనిమీద ఆ జిల్లాకు చెందిన కొందరు కోర్టులను ఆశ్రయిస్తే.. మత్స్యకార సొసైటీల సభ్యులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించాల్సిందేనని.. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం కూడా స్పష్టమైన తీర్పును ఇచ్చిందని మోపిదేవి అన్నారు.

ఈ జీవోను తీసుకురావడానికి ప్రధానం కారణం వంద హెక్టార్లు, ఆ పైన ఉన్న అంటే సుమారుగా 250 ఎకరాలు సామర్థ్యం గల ట్యాంకులను ఇంతకాలం మత్స్యకార సొసైటీలు నిర్వహించడం అనేది క్షేత్రస్థాయిలో జరగటం లేదన్నారు. పేరుకు సొసైటీలు.. పెత్తనం చేసేది మాత్రం దళారులదేనని ఆయన తెలిపారు. ట్యాంక్స్‌లో వచ్చే ఫలసాయంలో షేర్‌ ఇచ్చే దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఇవన్నీ ఆలోచించి.. సొసైటీ సభ్యులకు కనీసం వెయ్యి రూపాయలు ఆదాయం కూడా రావడం లేదని గుర్తించి.. ఇకపై వారికి కనీసం రూ.15వేలు వరకు ఆదాయం వచ్చేలా 217 జీవోను తీసుకువచ్చి... ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింది 27 ట్యాంకులను లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు..

మత్స్యకారుల మేలు కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చేస్తున్న మంచి పనిని కూడా ఆమోదించకుండా.. ప్రతిపక్ష పార్టీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మోపిదేవి ఆరోపించారు. మత్స్యకారుల ఆదాయం పెంచటం కోసం చేస్తున్న ఈ పనిని విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకులు అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంతకాలం వెయ్యి కూడా ఆదాయం రాని ప్రతి సొసైటీ సభ్యుడికి రూ.15వేలు ఆదాయం వస్తే లాభామా? నష్టమో మీరే సమాధానం చెప్పాలన్నారు.

చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు మరికొంతమంది పెద్దలు ఈ విధానం ద్వారా మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని పదేపదే అంటున్నారని,. చంద్రబాబుగారు ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ మత్స్యకారుల గొంతుకు ఉరి బిగించేలా ఉందంటూ ఏవేవో పిచ్చి రాతలు రాశారని మోపిదేవి ఆరోపించారు. మత్స్యకార సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెడుతున్నఈ పెద్దమనుషులు.. నాడు చంద్రబాబు (2015-17 సమయంలో) మత్స్యకార సామాజిక వర్గాన్ని అత్యంత హేయమైన పదాలతో కించపరిచేలా మాట్లాడినప్పుడు ఏమయ్యారు..?, ఎందుకు కనీసం ఖండించలేకపోయారని మోపిదేవి ప్రశ్నించారు.

టీడీపీ హామీ ఇచ్చిన విధంగా, తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు, అంశాలు, డిమాండ్లు సాధించుకోవాడానికి విశాఖపట్నంలో చంద్రబాబును కలిస్తే, వారిని దారుణంగా అవమానపరిచే విధంగా .. 'ఎక్కువ తక్కువగా మాట్లాడితే బట్టలూడదీస్తాను.. తోకలు కత్తిస్తా..' అని సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం మీకు గుర్తు లేదా? అని మోపిదేవి ప్రశ్నించారు. ఆనాడు మత్స్యకార జాతిని అవమానపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు అప్పట్లో ఈ సామాజిక వర్గ నేతలకు కనీసం చీమ కుట్టినట్లు లేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మంచి చేద్దామని ప్రయత్నిస్తుంటే అది మీకు చెడులా ఎందుకు కనిపిస్తోందన్నారు. ఆనాడు నోరు విప్పని మీరు ఇప్పుడు రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సమంజసం..? దీన్ని మీరు ఏవిధంగా సమర్థిస్తారని మోపిదేవి ప్రశ్నించారు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ.. అన్ని కుల వృత్తుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకుని, వారికి లబ్ది చేకూర్చేలా, అలాగే మత్స్య సంపదపై ఆధారపడి జీవించేవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

English summary
ysrcp mp mopidevi venkata ramana on today hails ap government's g.o 217, says it brightens fishermen lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X