వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్‌తో ఎంపీ సతీమణి కన్నుమూత
వైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమెను హైదరాబాద్ లో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అనూహ్య ఇబ్బందులు తలెత్తడంతో చివరికి ఆమె చనిపోయారు.

బ్రెయిన్ స్ట్రోక్ అంటూ..
ఎంపీ సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం ఉదయం ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు డాక్టర్లు పేర్కొన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఎంపీ ఇంట్లో విషాదం..
పిల్లి సుభాష్ భార్య సత్యనారాయణమ్మ మరణంతో వారి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కీలక నేత కుటుంబంలో విషాదంపై వైసీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆయన కీలకంగా వ్యవహరించి ఉండటంతో తెలంగాణకు చెందిన పలువురు నేతలు సైతం సంతపాలు తెలిపారు.
Recommended Video

స్వగ్రామంలోనే అంత్యక్రియలు..
ఆదివారం ఉదయం కన్నుమూసిన సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు.. వైసీపీ పెద్దలు, జిల్లా నేతలు ఎంపీ సుభాష్ కు ఫోన్లు చేసి పరామర్శించారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications