వైసీపీకి గుడ్ బై - తేల్చి చెప్పిన ఎంపీ మేడా..!!

వైసీపీ ఎంపీలు ఇద్దరు రాజీనామా చేసారు. మరి కొందరు ఎంపీలు అదే బాటలో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే సాయిరెడ్డి తాను పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలతో కొందరు ఎంపీలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే పార్టీ మరో ఎంపీ మేడా రఘునాధ రెడ్డి తన పార్టీ మార్పు అంశం పైన పూర్తి స్పస్టత ఇచ్చారు.

ఎంపీల రాజీనామా
వైసీపీ రాజ్యసభ సభ్యులు కొందరు కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ రోజు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు రాజ్యసభ సభ్యత్వానికి...వైసీపీకి రాజీనామా చేసారు. ఇద్దరూ టీడీపీలో చేరటం ఖాయమైనట్లు సమాచారం. అదే విధంగా పార్టీకి చెందిన మరో నలుగురు పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందులో జగన్ కు అత్యంత ఆప్తుడు అయిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు వినిపిస్తోంది. కానీ, ఆయన ఇప్పటి వరకు ఈ ప్రచారం పైన స్పందించ లేదు.

YSRCP MP Raghunath Reddy clarifies over his party change speculations

ఇద్దరు టీడీపీలోకి
పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సాయిరెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారనే వాదన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో తెర మీదకు వచ్చింది. దీని పైన ఆయన స్పందించారు. తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని తేల్చి చెప్పారు. తాను జగన్ తోనే ఉంటానని..వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. ఇక..మిగిలిన ఎంపీల్లో పలువురు బీజేపీ, టీడీపీ, జనసేనలో చేరుతారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే, వారంతా ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. అటు చంద్రబాబు తమ పార్టీలో చేరేవారు ప్రస్తుత పార్టీకి రాజీనామా చేసి రావాలని సూచించారు.

మేడా క్లారిటీ
ఇదే సమయంలో పార్టీ మార్పు పైన వైసీపీ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ప్రయాణం చేస్తానని వెల్లడించారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను వైఎస్సార్‌సీపీని వీడేది లేదన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌తోనే నా ప్రయాణం కొనసాగుతుందని మేడా తేల్చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+