• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిఐడి విచారణలో ఉమా కొత్త స్టోరీ, చంద్రబాబు పత్తిగింజనా.. పచ్చమాఫియా అంటూ సాయిరెడ్డి ధ్వజం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు,నారా లోకేష్,టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమాలను టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకుల తీరును తూర్పారబట్టారు . రాష్ట్రంలో ధూళిపాళ్ళ అరెస్ట్ ,దేవినేని ఉమా సిఐడీ విచారణ, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై టీడీపీ నాయకుల విమర్శలకు సమాధానం చెప్పారు .

పత్తి గింజ నీతిచంద్రిక బోధిస్తుంది, దోపిడీకి రింగ్ మాస్టర్ : చంద్రబాబుపై సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలుపత్తి గింజ నీతిచంద్రిక బోధిస్తుంది, దోపిడీకి రింగ్ మాస్టర్ : చంద్రబాబుపై సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

 సిఐడి విచారణకి వెళ్లి కొత్త స్టోరీ అల్లాడని ఉమాపై వ్యంగ్యం

సిఐడి విచారణకి వెళ్లి కొత్త స్టోరీ అల్లాడని ఉమాపై వ్యంగ్యం

ఇక తాజాగా సీఎం జగన్ గారి మాటలను వక్రీకరించేలా వీడియో మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికాడు దేవినేని ఉమ అంటూ ఉమా ను టార్గెట్ చేశారు విజయ సాయి రెడ్డి. సిఐడి విచారణకి వెళ్లి కొత్త స్టోరీ అల్లాడని, 20 కేసుల్లో స్టేలతో గడుపుతున్న చంద్రబాబు పత్తి గింజ అయినట్టు ఇరికించాలని చూస్తున్నారట... మీ ఇద్దరిపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమా అంటూ విజయ సాయి రెడ్డి అటు దేవినేని ఉమా ను, చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శించారు.

ప్రతీది జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా బాబూకొడుకులు

ప్రతీది జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా బాబూకొడుకులు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీలో కనిపించే సామూహిక దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు, మన రాష్ట్రంలోనివి కావని తండ్రి కొడుకులకు బాగా తెలుసు .ఇంకొక రాష్ట్రాన్ని వేలెత్తి చూపించే ధైర్యం లేక ప్రతీది జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారు అంటూ పేర్కొన్నారు.ఇదే సమయంలో ప్రజాక్షేత్రంలో ఉనికిని ప్రదర్శించాలంటే జనం మధ్యకు వెళ్లి సేవ చేయాలి. న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మారిస్తే ఎన్నికల్లో గెలవలేరు చంద్రబాబు అంటూ పేర్కొన్నారు .

వ్యవస్థలపైన ఆశలు పెట్టుకుంటే అసలుకే మోసం : చంద్రబాబుకు హితవు

వ్యవస్థలపైన ఆశలు పెట్టుకుంటే అసలుకే మోసం : చంద్రబాబుకు హితవు

ప్రజల్ని నమ్ముకుంటే ఇవ్వాళ కాకపోతే రేపైనా నాలుగు ఓట్లు పడతాయి. వ్యవస్థలపైన ఆశలు పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది అంటూ చంద్రబాబుకు హితవు పలికారు. ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టు మెట్లు ఎక్కడాన్ని టార్గెట్ చేశారు విజయ సాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువుల పెంపకం దారులు ఎప్పటికీ చంద్రబాబును, చంద్రబాబు దోపిడీ ముఠా ను క్షమించరని విజయ సాయి రెడ్డి ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్ట్ విషయంపై పేర్కొన్నారు.

పచ్చ మాఫియా ..రెండేళ్ళే అయింది కదా ఇంకా పచ్చదనం పోలేదు

పచ్చ మాఫియా ..రెండేళ్ళే అయింది కదా ఇంకా పచ్చదనం పోలేదు

పాడి రైతులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దోపిడీ చేశారని, చంద్రబాబు కంపెనీని లాభాల్లో నడిపించడంలో కోసం ఈ దోపిడీ ముఠా చెయ్యని నేరం లేదంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పచ్చమాఫియా అన్నిరంగాల్లోనూ వేళ్ళూనుకుంది అని, ఏదో ఒక రూపంలో స్వామి భక్తిని ప్రదర్శించాలని ఉబలాటపడుతోంది అని పేర్కొన్నారు. రెండేళ్ళే అయింది కదా ఇంకా పచ్చదనం పోలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  Uttam Kumar Reddy's Video From Hospital.. COVID బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం
  అఖండ మెజారిటీతో విజయ హారతులు పట్టిన జగన్ గారు ఉన్నారిక్కడ

  అఖండ మెజారిటీతో విజయ హారతులు పట్టిన జగన్ గారు ఉన్నారిక్కడ

  ప్రజలు అఖండ మెజారిటీతో విజయ హారతులు పట్టిన జగన్ గారు ఉన్నారిక్కడ. మాఫియా మూర్ఖపు పోకడలు మానుకోవాలి అంటూ హెచ్చరించారు.అంతేకాదు సంక్షేమ పథకాల్లో ఎక్కువ ఆదరణ దేనికి ఉందో బాబు దాన్నే టార్గెట్ చేస్తాడని ఆరోగ్యశ్రీ కింద ఒక్కరికీ ట్రీట్మెంట్ దొరకలేదని చచ్చు ఆరోపణ అలాంటిదే అని విమర్శించారు విజయసాయిరెడ్డి. కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించి ప్రాణాలు నిలిపారని ఎంతో మంది మీడియా సాక్షిగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చంద్రబాబుకు కనిపించవు అంటూ వ్యాఖ్యానించారు.

  English summary
  Vijayasai Reddy has made harsh remarks targeting TDP chief Chandrababu, Nara Lokesh and former TDP minister Devineni Uma. The TDP leaders' behavior as a social media platform has been slammed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X