అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య-చంద్రబాబు పాత్ర ! సీబీఐ దర్యాప్తు ! విజయసాయిరెడ్డి షాకింగ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా కలిసిపోయింది. తాజాగా హైదరాబాద్ లో అనుమానాస్పద పరిస్ధితుల్లో ఆత్మహత్య చేసుకున్న ఉమామహేశ్వరి హత్యకు కారణాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సంచలన చర్చకు తెరలేపారు. అంతేకాదు ఆయన పెట్టిన ట్వీట్ లో టీడీపీ అధినేత చంద్రబాబునూ లాగారు.

ఉమామహేశ్వరి ఆత్మహత్య

ఉమామహేశ్వరి ఆత్మహత్య

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య ఉదంతం అటు నందమూరి, ఇటు నారా కుటుంబాల్లో విషాదం నింపింది. ఉమామహేశ్వరి ఆత్మహత్యతో ఇరు కుటుంబాలు షాక్ కు గురయ్యాయి. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్ధితులు ఎందుకు తలెత్తాయి. దీనికి గల కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇందులో ఉమామహేశ్వరి కుటుంబం పాత్ర ఎంత ఉంది, లేకపోతే బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ లోపే కొత్త విషయాలపై చర్చలు పెరుగుతున్నాయి.

 విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

ఉమామహేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలపై ఎన్టీఆర్ కుటుంబంతో పాటు బయట కూడా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై కొత్త చర్చకు తెరలేపారు. నిత్యం తన ట్వీట్లతో చంద్రబాబును టార్గెట్ చేసే సాయిరెడ్డి.. ఇక్కడ కూడా చంద్రబాబును లాగారు. దీంతో పాటు ఆమె మరణంలో చంద్రబాబు పాత్ర ఉందా అన్న అనుమానాలు లేవనెత్తారు. అంతటితో ఆగకుండా మరిన్ని విషయాల్ని ఇందులో ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

చంద్రన్న పాత్ర-సీబీఐ దర్యాప్తు ?

చంద్రన్న పాత్ర-సీబీఐ దర్యాప్తు ?


ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై విజయసాయిరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలున్నాయి. చంద్రన్న వేధించాడా లేక ఇంకెవరైనా చంపి ఉరివేశారా ? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూతురు బేలగా అత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదన్నారు. సీబీఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి చంద్రన్నా అంటూ సాయిరెడ్డి వీరలెవల్లో సెటైర్లు వేశారు. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని చంద్రబాబుపై ఆయన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు దగ్గరివాళ్లే ఎందుకిలా ?

చంద్రబాబు దగ్గరివాళ్లే ఎందుకిలా ?

మరో ట్వీట్ లో చంద్రబాబుతో పాటు మరికొందరిని కూడా విజయసాయిరెడ్డి లాగారు. అప్పట్లో కోడెలది గుండెపోటు అన్నారు. తర్వాత ఉరి వేసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత మొబైల్ మాయం చేశారు. ఉమామహేశ్వరి గారిదీ సహజమరణమని నమ్మించాలని చూశారు. చంద్రబాబుకు దగ్గరివాళ్లే ఎందుకిలా అర్ధాంతరంగా చనిపోతున్నారంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. తద్వారా కోడెల ఆత్మహత్యను, ఉమామహేశ్వరి ఆత్మహత్యతో పోలుస్తూ చంద్రబాబును టార్గెట్ చేసేందుకు సాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు.

English summary
ysrcp mp vijaya sai reddy on today raised doubts on ntr's daughter uma maheswari's suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X