టీడీపీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే..? 7 స్టెప్స్ లో చెప్పిన సాయిరెడ్డి..!
ఏపీలో అధికార టీడీపీ పేరు చెబితే మండిపడే వైసీపీ నేతల్లో విజయసాయిరెడ్డి ముందుంటారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ టీడీపీని, చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి వందల సంఖ్యలో ట్వీట్లు పెట్టేవారు. వీటిపై టీడీపీ నేతలు కూడా మండిపడేవారు. అయితే ఇప్పుడు అధికారం చేతులు మారిన తర్వాత కూడా టీడీపీని సాయిరెడ్డి వదలడం లేదు. ఇదే క్రమంలో రాష్ట్రంలో టీడీపీ చేసే రాజకీయాన్ని ఏడు ముక్కల్లో సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. తద్వారా టీడీపీ గుట్టు విప్పేశారు.
రాష్ట్రంలో టీడీపీ పనిచేసే విధానం ఎలా ఉంటుందో వివరిస్తూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన..
ముందుగా టీడీపీ సమస్యను సృష్టిస్తుందని, ఆ తర్వాత ప్రజలు నిరసన తెలిపేలా చేస్తుందని, అనంతరం విపక్ష నేతలను విమర్శిస్తుందని సాయిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆ సమస్యపై ఆందోళన చెందుతున్నట్లు నటిస్తుందని, అనంతరం సమస్య కొనసాగేలా చూసుకుంటుందని వివరించారు.

ఆ తర్వాత టీడీపీ సమస్యలను పరిష్కరించడానికి పని చేస్తున్నట్లుగా చూపిస్తుందని సాయిరెడ్డి తెలిపారు. అనంతరం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినందుకు దాని క్రెడిట్ పొందుతుందన్నారు. ఏపీలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణం టీడీపీయే అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ను ముగించారు. తద్వారా ఏపీలో ప్రస్తుతం ఉన్న సమస్యల్ని టీడీపీయే సృష్టించి దాన్ని పరిష్కరించినట్లు బిల్డప్ ఇస్తుందన్న అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు. దీంతో ఎప్పటిలాగే ఆయన ప్రత్యర్థులు దీనికి కౌంటర్లు వేస్తున్నారు.
TDP’s mode of operation:
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 14, 2024
1. Create the problem
2. Let people protest
3. Blame opposition leaders
4. Pretend to be concerned
5. Ensure the problem persists.
6. Acting as if working to resolve issues.
7. Get credit for trying to resolve the issue
TDP is the root…












Click it and Unblock the Notifications