పార్లమెంట్ సమావేశాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్!!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి కొనసాగుతున్నాయి. సరికొత్త పొత్తులతో అధికార, విపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న సమయంలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అధికార బీజేపీ ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్ష పార్టీలు, వివక్ష పార్టీల ఎత్తుగడలను చిత్తు చేయడానికి అధికార పక్షం రెడీ అయింది .

ముఖ్యంగా మణిపూర్ అల్లర్లపై ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి కూడా స్పందించకపోవడంతో, దానిని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకు పడాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, రైల్వే భద్రత, సరిహద్దులలో పరిస్థితులు ఇతర అంశాలు కూడా పార్లమెంటు సమావేశాలలో చర్చకు వచ్చేలా చూడాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి.

vijayasaireddy

ఇదిలా ఉంటే నేడు కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి INDIA నేడు కీలక భేటీ నిర్వహించనుంది. పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేడు నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే చాంబర్ లో నేడు భేటీ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 11వరకు మొత్తం 17 పనిదినాల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

ఇదిలా ఉంటే పార్లమెంటు సమావేశాలు సాజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో 31 బిల్లులు చర్చకు రానున్నాయని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో, వర్షాకాల సమావేశాలు సజావుగా జరగాలని వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మకమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు . నేటి నుండి ప్రారంభమైన వర్షాకాల పార్లమెంటు సమావేశాలు అత్యంత ఉత్పాదకతతో సాగుతాయని ఆశిస్తున్నానని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకించి రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలని వెల్లడించారు.

అంతేకాదు నిన్నటికి నిన్న ఢిల్లీలో అఖిల పక్ష భేటీలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తాను అని వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని ఎంపీ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+