Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ వల్ల దేశానికి,తెలుగుదేశానికి ఏంటి ఉపయోగం? చంద్రబాబులాగే ఆ జబ్బు 'పప్పు'రత్నానికి : సాయిరెడ్డి సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. నీవల్ల దేశానికి, తెలుగు దేశానికి ఏమిటి ఉపయోగం అంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సైతం విమర్శలు గుప్పించారు. ఇక హెరిటేజ్ సంస్థపై సైతం విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పక్క రాష్ట్రంలో కూర్చుని విషం కక్కటం తప్ప జనానికి చేసిన మేలు జీరో

పక్క రాష్ట్రంలో కూర్చుని విషం కక్కటం తప్ప జనానికి చేసిన మేలు జీరో

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కరోనా తొలిదశ నుండి నేటి వరకు దాదాపు ఏడాదికి పైగా చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చొని విషం కక్కడం తప్ప జనానికి చేసిన మేలు జీరో అంటూ సైరా పంచ్ వేశారు.అంతేకాదు అమూల్ సంస్థపై టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ధూళిపాళ్లకు 1,400 కోట్ల సంగం డెయిరీ ఆస్తులను అప్పగించి వాటాలు పంచుకున్న చంద్రబాబు, ఆయన బందిపోటు ముఠా అమూల్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారు.

 చంద్రబాబు జబ్బు పప్పు రత్నానికి కూడా అంటుకుంది

చంద్రబాబు జబ్బు పప్పు రత్నానికి కూడా అంటుకుంది

అమూల్ హెరిటేజ్ లా రైతుల రక్తం పీల్చే ప్రైవేటు సంస్థ కాదు,లక్షల మంది రైతులు యజమానులుగా ఉన్న సహకార సొసైటీ అంటూ టిడిపి నేతలు విమర్శల పై రివర్స్ కౌంటర్ వేశారు.ఇదే సమయంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తన వల్లే అంటాడు చంద్రబాబు అంటూ చంద్రబాబు పై సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి పరీక్షల రద్దు విషయంలో నారా లోకేష్ ను టార్గెట్ చేశారు.ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తన వల్లనే అంటాడు చంద్రబాబు, కలామ్ ను రాష్ట్రపతిగా ,వాజ్పేయి ప్రధానిగా చేసింది తానేనంటాడు. ఇక ఆ జబ్బు పప్పు రత్నానికి కూడా అంటుకుంది అంటూ వ్యాఖ్యానించారు.

 కేఏ పాల్ కన్నా పెద్ద నాయకుడివా లోకేశం?

కేఏ పాల్ కన్నా పెద్ద నాయకుడివా లోకేశం?

ఇంటర్ పరీక్షలు వాయిదా తన వల్లే అని డప్పు కొట్టుకుంటున్నాడు. కేఏ పాల్ కన్నా పెద్ద నాయకుడివా లోకేశం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కరోనా మహమ్మారి కంటే ఎల్లో వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని, ప్రాణాంతక వైరస్ అని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ వాస్తవాన్ని తెలుసుకున్న ఏపీ ప్రజలు తమకు ఉన్న ఓటు అనే పవర్ ద్వారా పసుపు వైరస్ వ్యాప్తి చేసే వారిని ఏపీలో అన్ని గ్రామీణ, మునిసిపల్, స్థానిక సంస్థల నుండి దూరంగా ఉంచారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 రాజధాని విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది

రాజధాని విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది

ఇదే సమయంలో విశాఖ పరిపాలనా రాజధాని అని రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి . సాగర నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంటూ పేర్కొన్నారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు అధికార వైసీపీ చేస్తున్న కార్యక్రమాలను, సీఎం జగన్ నిర్ణయాలను పేర్కొంటూ అందరికే తెలిపే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+