• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేకి బాబు.. అల్జీమర్స్ నాయుడు డర్టీ పొలిటీషియన్ లా మిగిలావు: చంద్రబాబును వదిలిపెట్టని సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేతలు మూకుమ్మడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై మండి పడుతున్నప్పటికీ సాయి రెడ్డి తన పంథాను మార్చుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, లోకేష్, అయ్యన్నపాత్రుడు ఇలా తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి అల్జీమర్స్ నాయుడు అంటూ విరుచుకుపడ్డారు. చరిత్ర చీకటి పేజీలో తిరస్కృతుడిగా మిగిలిపోతావ్ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

 లాస్ట్ స్టేజ్ లో ఇంకా నీచాతి నీచంగా ఒక శనిగా మారావు: చంద్రబాబుపై సాయిరెడ్డి

లాస్ట్ స్టేజ్ లో ఇంకా నీచాతి నీచంగా ఒక శనిగా మారావు: చంద్రబాబుపై సాయిరెడ్డి


చంద్రబాబు ఒక డర్టీ పొలిటిషియన్ గా మిగిలిపోయారని సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఆల్జీమర్స్ నాయుడు వినిపిస్తోందా.. పసిపిల్లలు ఏమంటున్నారో? అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి సీఎంగా చేసి రాజనీతిజ్ఞుడుగా కాకుండా డర్టీ పొలిటిషియన్ గా మిగిలిపోయారని విమర్శించారు. లాస్ట్ స్టేజ్ లో ఇంకా నీచాతి నీచంగా ఒక శనిగా మారావు అంటూ మండిపడ్డారు. వెన్నుపోటు దారుడు గా, తిరస్కృతుడిగా చరిత్ర చీకటి పేజీలో మిగిలిపోతావ్ అని విమర్శలు గుప్పించారు.

ముసలి అవినీతి నాయుడు అంటూ మండిపడిన సాయిరెడ్డి

ముసలి అవినీతి నాయుడు అంటూ మండిపడిన సాయిరెడ్డి

ఇక ముసలి అవినీతి నాయుడు అంటూ మరో పోస్ట్ లో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి చదువు ప్రైవేటు బాధ్యత అని నారాయణ, చైతన్యలను వేలకోట్లకు పడగలెత్తించావు అంటూ విరుచుకుపడ్డారు. నువ్వు మూసేసిన స్కూళ్లన్నీ కొత్త హంగులతో జీవం పోసుకున్నాయి ముసలి,అవినీతి నాయుడూ అని విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. చదువుపై పెట్టే ప్రతి పైసా పవిత్ర పెట్టుబడి అని యువసీఎం అభయం ఇస్తుంటే, సరస్వతి అడుగుల చప్పుడు పేద పిల్లల ఇళ్లలో వినిపిస్తోంది అంటూ విజయ సాయి రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి చదువు ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు.

 గంజా దమ్ము పుంజుకోలేదు .. అందుకే ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి కూతలు

గంజా దమ్ము పుంజుకోలేదు .. అందుకే ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి కూతలు

అంతేకాదు మూడేళ్ల క్రితం 23 వేల ఓట్ల తేడాతో గల్లంతయిన అప్పటికీ ఇప్పటికీ రాజకీయంగా "గంజా దమ్ము" పుంజుకున్నది లేదు అంటూ అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఈ సారి అంత కంటే ఘోరమైన పరాజయం తప్పదని అర్ధం అవబట్టే ఫ్రస్టేషన్లో పిచ్చి కూతలు కూస్తున్నాడు అంటూ సాయి రెడ్డి మండిపడ్డారు. నీ మీద గణేష్ గెలిచిన గణేష్ సరిపోడా? ఎవరో ఎందుకు.. అక్కడే తేల్చుకో.. నీ బతుకేమిటో అంటూ విజయసాయిరెడ్డి అయ్యన్నపాత్రుడు ని మరోమారు టార్గెట్ చేశారు.

లేకి బాబు వాడకంలో కరివేపాకులా.. అనితపైనా ఆపని సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

లేకి బాబు వాడకంలో కరివేపాకులా.. అనితపైనా ఆపని సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఇక అంతకు ముందు వంగలపూడి అనిత అనిత టార్గెట్ చేసి బ్రోతల్ హౌస్ ఓనర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి బంతీ, చేమంతీ, పూబంతీ పదాలు సినిమా పాటల్లో రమ్యంగా వినిపిస్తాయి. రాజకీయాల్లో ఉండవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బంతి లాంటి దానినని వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. రణక్షేత్రంలో పోరాడినోళ్లే మిగులుతారు. బ్రోతల్ హౌస్ ఓనర్ అని కనికరం చూపే పరిస్థితి ఉండదు. ఎగిరిపడిన చాలా మంది 'లేకి బాబు' వాడకంలో కరివేపాకులైపోయారు. పాపం నువ్వెంత? అంటూ విజయసాయిరెడ్డి అనిత పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నేతలు విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తున్నా, ఏ మాత్రం తగ్గకుండా సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పదేపదే టిడిపి నేతలను టార్గెట్ చేస్తున్నారు.

English summary
YSRCP MP Vijayasai reddy was angry with TDP chief Chandrababu, Ayyannapatrudu and Vangalapudi Anitha. Sayireddy targeted Alzheimer's Naidu becomes like Dirty Politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X