
నారా లోకేష్ కు విజయసాయిరెడ్డి రన్ ఛాలెంజ్-రాహుల్ గాంధీ పరుగు ఫొటో ట్వీట్ చేస్తూ...
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగే రాజకీయాల్లో నిత్యం ట్వీట్లతో హల్ చల్ చేయడం రాజ్యసభఎంపీ విజయసాయిరెడ్డికి అలవాటు. నిత్యం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై సాయిరెడ్డి వరుసగా ట్వీట్లు పెడుతుంటారు. ఓ దశలో ఈ ట్వీట్లు టీడీపీకే కాదు ఒక్కోసారి సొంత పార్టీ నేతల్ని సైతం చికాకుపుట్టిస్తుంటాయి. అయినా ఆయన మాత్రం వెనక్కి తగ్గరు.
తాజాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో లోకేష్ కు సాయిరెడ్డి ఓ సవాల్ కూడా చేశారు. ఈ సవాల్ ను అధిగమించడం ద్వారా తన పార్టీ టీడీపీ కార్యకర్తల కళ్లు తెరిపించాలంటూ సాయిరెడ్డి వెటకారాన్ని కూడా దట్టించారు. అక్కడితో ఆగకుండా ఇందులో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని సైతం లాగారు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇంతకీ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో ఏం పెట్టారో తెలుసా ? "పప్పు నాయుడు కూడా ఓ నాలుగు కిలో మీటర్లు ఆగకుండా పరుగెత్తి మోకాళ్ల జాయింట్లు, మెదడులో చిప్ పర్ ఫెక్టుగా ఉన్నాయని నిరూపించుకోవాలి. ఆయన బాడీ బ్యాలెన్స్ మీద కార్యకర్తలకున్న అనుమానాలు పటాపంచలు చేయాలంటే రన్నింగ్ తప్పదు" అంటూ సాయిరెడ్డి రెచ్చిపోయారు. తద్వారా రాహుల్ గాంధీతో పాటు నారా లోకేష్ పై తనకున్న అక్కసును మరోసారి ప్రదర్శించారు. ఇప్పటికే రాహుల్ భారత్ జోడో యాత్రను విమర్శిస్తూ ట్వీట్లు పెడుతున్న సాయిరెడ్డి... ఇప్పుడు లోకేష్ ను కూడా దానికి లింక్ చేస్తూ సవాల్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పప్పు నాయుడు కూడా ఓ నాలుగు కిలో మీటర్లు ఆగకుండా పరుగెత్తి మోకాళ్ల జాయింట్లు, మెదడులో చిప్ పర్ ఫెక్టుగా ఉన్నాయని నిరూపించుకోవాలి. ఆయన బాడీ బ్యాలెన్స్ మీద కార్యకర్తలకున్న అనుమానాలు పటాపంచలు చేయాలంటే రన్నింగ్ తప్పదు. pic.twitter.com/5dSnFsiUks
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2022