VijayaSaiReddy on Eenadu : ఈనాడు పాఠకులకు విజయసాయిరెడ్డి హెచ్చరిక !
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ ఎల్లో మీడియా పోరు రోజురోజుకూ ముదురుతోంది. రోజూ ఏదో ఒక అంశంపై ట్వీట్లు పెడుతూ ఎల్లో మీడియాను టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి ఈ మధ్య ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన ఇవాళ ఈనాడు పత్రిక పాఠకుల్ని ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు.
ఈనాడు పత్రిక పాఠకులను అప్రమత్తం చేస్తూనే హెచ్చరించేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. ఈనాడు కథనాలు చదవడం వల్ల కలిగే నష్టాలను ఈ ట్వీట్ లో సాయిరెడ్డి వివరించారు. ఇన్నాళ్లూ ఈనాడు అధినేత రామోజీరావును వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని, ఆయన వ్యాపారాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి.. ఈసారి ఈనాడు పాఠకుల్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అందులోనూ ఆయన చేసిన హెచ్చరికలు చూస్తే అధికార పార్టీ ఎంపీ తీరు అర్ధమవుతోంది.

ఈనాడు చదివితే పాఠకులు మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉందంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో హెచ్చరించారు. కట్టుకథలు, ఏదో జరుగుతున్నట్లు కల్పితాలు, అంతా బావున్నా ప్రతీదీ అస్తవ్యస్తమైనట్లు భయాందోళనలు కలిగించడం వల్ల ప్రశాంతత పోతుందన్నారు. వ్యక్తిగత విషయాలు కూడా అనుమానాస్పదంగా, అపనమ్మకంగా కనిపిస్తాయన్నారు. పాఠకులూ జాగ్రత్త అంటూచివర్లో ఓ లాస్ట్ పంచ్ కూడా వేశారు. దీంతో సాయిరెడ్డి మీడియాను లక్ష్యంగా చేసుకోవడంలో పీక్ కు చేరినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications