వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్టరీ సింబల్స్, పచ్చ జెండాలతో పచ్చ రాబందుల శవ రాజకీయం ; లోకేష్ పై వైసీపీ ఎంపీల ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతి రమ్య హత్య ఘటన పెను దుమారంగా మారింది. ప్రేమోన్మాది చేతిలో పట్ట పగలు దారుణంగా హత్యకు గురైన రమ్య ఘటనపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది టిడిపి. ఏపీ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, యువతులకు రక్షణ లేకుండా పోతుందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు మరణించినా తెలుగుదేశం పార్టీ నుండి నారా లోకేష్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న విషయం తెలిసిందే.

దళిత యువతిని హతమార్చిన వెధవ చంద్రబాబు లాంటివాడే , లోకేష్ తో లుచ్చా పనులు : కొడాలి నాని ధ్వజం దళిత యువతిని హతమార్చిన వెధవ చంద్రబాబు లాంటివాడే , లోకేష్ తో లుచ్చా పనులు : కొడాలి నాని ధ్వజం

శవ రాజకీయం చేస్తున్న పచ్చ రాబందులు .. వైసీపీ ఎంపీలు ఫైర్

శవ రాజకీయం చేస్తున్న పచ్చ రాబందులు .. వైసీపీ ఎంపీలు ఫైర్


ఈ క్రమంలో తాజాగా రమ్య హత్య ఘటన తర్వాత రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. దీంతో నారా లోకేష్ పై నిప్పులు చెరుగుతున్నారు వైసిపి నాయకులు. డెడ్ బాడీ కనిపిస్తే లోకేష్ రాబందులా వాలిపోతాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అంతేకాదు శవ రాజకీయం చేస్తున్న పచ్చ రాబందులు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లోకేష్ పర్యటనను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు.

 లోకేష్ కు బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గిందని ఎద్దేవా

లోకేష్ కు బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గిందని ఎద్దేవా

ఇక లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించారు ఎంపీ నందిగం సురేష్ . బూతులు తిడితే హీరో అయిపోతానని లోకేష్ అనుకుంటున్నాడని విమర్శించారు. పిచ్చి వర్కౌట్లు చేసి బాడీ వెయిట్ తోపాటు లోకేష్ కు బుర్ర వెయిట్ కూడా తగ్గిందని ఎద్దేవా చేశారు. లోకేష్ కు తన తండ్రి హయాంలో దళితులపై జరిగిన దాడులు సంగతి తెలుసా అంటూ ప్రశ్నించిన నందిగం సురేష్, కారంచేడు సంఘటన ఎవరి హయాంలో జరిగిందో లోకేష్ తెలుసుకోవాలంటూ విమర్శలు గుప్పించారు. లోకేష్ బుర్ర తక్కువ వ్యక్తి, పరమశుంఠ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ రమ్య ఇంటి వద్ద వెకిలి నవ్వులు నవ్వాడన్న నందిగం సురేష్

లోకేష్ రమ్య ఇంటి వద్ద వెకిలి నవ్వులు నవ్వాడన్న నందిగం సురేష్


గతంలో చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ వ్యాఖ్యలు చేశారని, ఆ మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అని చెప్పిన నందిగం సురేష్ ఇప్పుడు దళితుల కోసం అంటూ టిడిపి నేతలు తిరిగినంత మాత్రాన దళితులు వారిని నమ్మరని పేర్కొన్నారు. నేరస్తుడు ఎలాంటి వ్యక్తి అయినా కఠిన శిక్ష పడటం ఖాయమని నందిగం సురేష్ వెల్లడించారు. నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు లోకేష్ వెకిలి నవ్వులు నవ్వాడని నందిగం సురేష్ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే ఎక్కడైనా మృతదేహం ఉంటే రాబందుల కంటే ముందుగా లోకేష్ వాలిపోతుంటారు అని ఎద్దేవా చేశారు. ఎస్సీలను వేధింపులకు గురి చేయటం చంద్రబాబు పేటెంట్ అంటూ నందిగం సురేష్ ధ్వజమెత్తారు.

 విక్టరీ సింబల్స్, పచ్చ జెండాలతో.. సైరా పంచ్ వేసిన సాయిరెడ్డి

విక్టరీ సింబల్స్, పచ్చ జెండాలతో.. సైరా పంచ్ వేసిన సాయిరెడ్డి

ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ నేతల పై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి హత్య జరిగిన 12 గంటల లోపే నిందితుడిని అరెస్టు చేసి కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందని పేర్కొన్నారు ఇదే సమయంలో ప్రభుత్వంపై విషం చిమ్మే చాన్స్ లేకపోవడంతో విక్టరీ సింబల్స్, పచ్చ జెండాలతో శవ రాజకీయం చేసిన పచ్చ రాబందులు అంటూ నిన్న లోకేష్ పర్యటన కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి సైరా పంచ్ వేశారు.

అధికారంలో ఉన్నప్పుడు దళితులపై టీడీపీ నేతల హత్యాకాండ

అధికారంలో ఉన్నప్పుడు దళితులపై టీడీపీ నేతల హత్యాకాండ


అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు దళితులపై టిడిపి నేతలు హత్యాకాండ సాగించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైపు దాడులు చేస్తూనే మరో వైపు మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజ మెత్తారు. పెదకూరపాడు వద్ద దళితులను చర్చలకు పిలిచి ఎల్లో గ్యాంగ్ దాడి చేసిందని గుర్తు చేశారు. అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది పచ్చ బ్యాచ్ అని విజయ సాయి రెడ్డి విమర్శనాస్త్రాలను సంధించారు. ఇప్పుడు దళితులపై యెనలేని ప్రేమ ఉన్నట్టు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
Nara Lokesh went to visit Ramya's family after the latest Ramya murder incident in the order, targeted jagan's govt. With this, YCP leaders are setting fire to Nara Lokesh. YCP MP Nandigam Suresh is making harsh remarks that Lokesh will turn into a vulture if any dead body is found. YCP MP Vijayasaireddy is also targeting Lokesh's visit and setting it on fire, saying that the yellow vultures are doing corpse politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X