చంద్రబాబు టూర్లపై సీఎం జగన్ కొత్త స్ట్రాటజీ ? పోటీ యాత్రలు,ఫ్లెక్సీలతో వార్

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలన్న లక్ష్యంతో క్షేత్రస్దాయిలో వరుస పర్యటనలు చేస్తున్న చంద్రబాబు జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో చంద్రబాబు యాత్రలు చేస్తున్నారు. చంద్రబాబు నినాదాన్ని తిరిగి ఆయనపైనే ప్రయోగించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో బాబుయాత్రల్ని కూడా అక్కడికక్కడే అడ్డుకునేందుకు కౌంటర్ వ్యూహాల్ని ప్రయోగిస్తోంది.

చంద్రబాబు వరుస పర్యటనలు

రాష్ట్రంలో విపక్ష నేత చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటనతో ప్రారంభించి ఇప్పుడు జరుగుతున్న పశ్ఛిమ గోదావరి పర్యటనలోనూ చంద్రబాబుకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందని వారు, వైసీపీ నేతల బాధితులు టీడీపీని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటివారిని చంద్రబాబు టూర్లకు టీడీపీ నేతలు తరలిస్తున్నారు. దీంతో వారంతా ఇప్పుడు చంద్రబాబుటూర్లలో దర్శనమిస్తున్నారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు రెగ్యులర్ గా టూర్లకు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

అప్రమత్తమైన వైసీపీ

రాష్ట్రంలో చంద్రబాబు చేపడుతున్న జిల్లాల టూర్ల పై వైసీపీ సర్కార్ కు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు నివేదికలు అందిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాల్లో చంద్రబాబు టూర్లకు తరలివస్తున్న జనం ఎవరు, కేవలం టీడీపీ శ్రేణులు మాత్రమే వస్తున్నారా లేక సాధారణ ప్రజలు, తటస్ధులు కూడా తరలివస్తున్నారా అనేది నిఘా వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.

కౌంటర్ స్ట్రాటజీ అమలు ?

చంద్రబాబు టూర్లకు వైసీపీ నేతలు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబు టూర్లకు పోటీగా అదే నియోజకవర్గాల్లో, అదే సమయంలోయాత్రలు నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు దెందులూరు టూర్ ప్రకటించగానే, దానికి పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేపట్టిన యాత్ర ఇలాంటిదే. అలాగే చంద్రబాబు తాడేపల్లి గూడెం పర్యటన నేపథ్యంలో టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు పోటీగా వైసీపీ నేతలు కూడా ఫ్లెక్సీలు కట్టారు. అదీ చంద్రబాబు నినాదం ఇదే ఖర్మకు పోటీగా దాన్ని చంద్రబాబుపైకే ప్రయోగిస్తూ సెటైర్లు ఇందులో ఉంటున్నాయి. టీడీపీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది

 కేసీఆర్ తరహాలోనే జగన్ ప్లాన్ ?

కేసీఆర్ తరహాలోనే జగన్ ప్లాన్ ?


ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నారు. అలాగే షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. వీరికి ఆటంకాలు ఎదురవుతున్నారు.పలుచోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ యాత్రలు ఉద్రిక్తంగా మారితే శాంతి భద్రతల పేరు చెప్పి వాటిని నిలిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటు బీజేపీ నేతలు అటు షర్మిలా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లోనే బండి సంజయ్, షర్మిల హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని మరీ యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు టూర్లను కూడా వైసీపీ అదే తరహాలో అడ్డుకుంటే ఇక్కడా అలాంటి పరిస్దితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+