4 లక్షల ఉద్యోగాలు-మండలిలో దొరికిపోయిన సర్కార్ -బొత్స చెడుగుడు..!

వైసీపీ బాయ్ కాట్ తో ఏపీ శాసనసభ సమావేశాలు ఏకపక్షంగా సాగుతుండగా.. అటు మండలిలో మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ కొనసాగింది. బడ్జెట్ సమావేశాల రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇందులో గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పడాన్ని వైసీపీ తప్పుబట్టింది. దీంతో సభలో చాలా సేపు అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిన్న గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. దీనిపై ఇవాళ మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ముందుగా వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరం తెలిపారు. దీంతో ఆమెను అడ్డుకునేందుకు మంత్రులు లోకేష్, స్వామి, సవిత ప్రయత్నించారు. దీంతో విపక్ష నేత బొత్స రంగంలోకి దిగారు.

ysrcp objections over 4lakh jobs filling in governor speech nara Lokesh clarified its in process

గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో 4 లక్షల అవకాశాలు కల్పించినట్లు చెప్పిన విషయం చదివి వినిపించారు. దీంతో మంత్రి నారా లోకేష్ అభ్యంతరం తెలిపారు. 4 లక్షల అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయన్నారు. దీంతో అదే విషయం గవర్నర్ ప్రసంగంలో మార్చాలని కోరారు.

దీన్ని అంగీకరించని లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీలు బొత్సతో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లీష్, తెలుగు ప్రసంగాల్లో ఈ విషయాన్ని వేర్వేరుగా ప్రస్తావించారని, దీన్ని కూడా మార్చాలని కోరారు. దీనికి అంగీకరించని టీడీపీ ఎమ్మెల్సీలు వాగ్వాదం కొనసాగించారు. దీంతో మండలి ఛైర్మన్ జోక్యం చేసుకుని లోకేష్ ఇచ్చిన క్లారిటీ సరిపోతుందని మిగతా చర్చను కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+