విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు బాటలోజగన్: సెంటిమెంట్ ను పక్కనపెట్టి, వైసీపీ ప్లాన్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ టిడిపిని ఫాలో అవుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే నష్టమని ఆయన భావిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ టిడిపిని ఫాలో అవుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే నష్టమని ఆయన భావిస్తున్నారు. సెంటిమెంట్ కంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్లే పార్టీకి ప్రయోజనమనే ఆ పార్టీ నాయకత్వం తలపెట్టింది.ఈ మేరకు జూలై 8,9 తేదిల్లో వైసీపీ ప్లీనరీని విజయవాడలో నిర్వహించనుంది వైసీపీ.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహారచన చేస్తోంది.ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్లే పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది.

వచ్చే ఎన్నికలనాటికి వ్యూహాలను మార్చాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ నియమించుకొంది. పార్టీ ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్ ను జగన్ పార్టీ నాయకులకు పరిచయం చేయనున్నారు.

టిడిపి తరహాలోనే గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పార్టీ సమీక్షలను నిర్వహించనుంది.ఈ సమీక్షల సందర్భంగా పార్టీ బలబలాను సమీక్షించనున్నారు.

జూలైలో విజయవాడలో వైసీపీ ప్లీనరీ

జూలైలో విజయవాడలో వైసీపీ ప్లీనరీ

ఈ ఏడాది జూలై మాసంలో విజయవాడలో వైసీపీ ప్లీనరీని నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. ఈ ప్లీనం కంటే ముందుగానే నియోజకవర్గ, జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలను నిర్వహించనుంది ఆ పార్టీ. ఈ నెలాఖరులోపుగా ఆయా నియోజకవర్గాల సమీక్షలను నిర్వహించనున్నారు.ఈ సమీక్షల తర్వాత జూన్ 19,20,21 తేదిల్లో జిల్లా స్థాయిల్లో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల తర్వాత జూలై 8,9 తేదిల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నారు.

సెంటిమెంట్ కంటే సంస్థాగతమే ముఖ్యం

సెంటిమెంట్ కంటే సంస్థాగతమే ముఖ్యం

వైఎస్ సెంటిమెంట్ ఆధారంగా ఇంతకాలంపాటు ఆ పార్టీ నడిచింది. అయితే రానున్న రోజుల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువకాలం మనుగడ సాధించలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే అదే సమయంలో రానున్న ఎన్నికల కోసం వైసీపీ సెంటిమెంట్ కంటే పార్టీని బలోపేతం చేయడంపైనే కేంద్రీకరించింది. పార్టీని గ్రామస్థాయి నుండి పునర్నిర్మాణం చేస్తే ప్రయోజనమనే అభిప్రాయంతో వైసీపీ నాయకత్వం ఉంది.వైఎస్ఆర్ సెంటిమెంట్ ను క్రమంగా తగ్గిస్తూవస్తోంది ఆ పార్టీ.

విజయవాడను ఎంచుకోవడం వెనుక ఉద్దేశ్యమిదే

విజయవాడను ఎంచుకోవడం వెనుక ఉద్దేశ్యమిదే

వైసీపీ తన కార్యకలాపాలను విజయవాడ కేంద్రంగా చేయాలని ఇటీవల జరిగి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి నిర్ణయం తీసుకొన్నారు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తేనే పార్టీకి మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.దరిమిలా పార్టీ నాయకత్వం ప్లీనరీ వేదికను విజయవాడను వేదికగా చేసుకొంది. ప్లీనరీ ఎక్కువగా ఇడుపులపాయలోనే జరిగేవి.అయితే ఇడుపులపాయ కాకుండా విజయవాడను ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యమిదేనని పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించారనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతోందని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.

టిడిపి తరహలోనే సంస్థాగత నిర్మాణం

టిడిపి తరహలోనే సంస్థాగత నిర్మాణం

టిడిపి తరహాలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని వైసీపీ భావిస్తోంది. బూత్ స్థాయి నుండి టిడిపి నిర్మాణం చేపట్టింది.అయితే అదే తరహాలోనే బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని వైసీపీ తలపెట్టింది.రానున్న ఎన్నికల సమయంనాటికి పార్టీ వ్యూహలను ప్రశాంత్ కిషోర్ రచించనున్నారు.పార్టీ ప్లీనరీ వేదికపై నేతలకు ప్రశాంత్ కిషోర్ ను జగన్ పరిచయం చేయనున్నారు.మరో వైపు పార్టీ నాయకులకు ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ క్లాస్ చెప్పే అవకాశాలు కూడ లేకపోలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

English summary
Ysrcp plenary will conduct on july 8, 9 in Vijayawada.Jagan planning to strengthen ysrcp like Tdp from village level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X