లీకేజ్ లతో మద్యం ఆదాయానికి గండి ? వైసీపీ సంచలన ఆరోపణలు..!
ఏపీలో కూటమి సర్కార్ గతేడాది కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకున్న మద్యం వ్యాపారాన్ని తిరిగి ప్రైవేటు వారికి అప్పగించింది. మద్యం వ్యాపారంలో అవినీతిని అడ్డుకునేందుకు పూర్తి పారదర్శక విధానం అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో పెరగాల్సిన మద్యం ఆదాయాలు ఆశించిన మేర లేకపోవడంపై వైసీపీ ఆరోపణలు గుప్పించింది.

With respect to excise revenues, the @JaiTDP alliance Government, privatized retail operations of liquor, increased number of shops, encouraged illegal belt shops and reintroduced illegal permit rooms. All these policy changes should have resulted in huge increase in liquor… pic.twitter.com/A3aKO0eysQ
— YSR Congress Party (@YSRCParty) September 17, 2025
కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఎక్సైజ్ ఆదాయాల పెరుగుదల మునుపటి ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఎక్సైజ్ ఆదాయాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉంటుందని భావించినట్లు వైసీపీ తెలిపింది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాలు రూ. 6,782.21 కోట్లుగా ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో అదే రూ.6,992.77 కోట్లుగా ఉందని కాగ్ గణాంకాలను విడుదల చేసిందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఎక్సైజ్ ఆదాయాల వృద్ధి కేవలం 3.10% మాత్రమేనని తెలిపింది.

అన్ని విధాన మార్పులు చేయకపోయినా, సాధారణ సమయంలో దాదాపు 10% వరకు ఎక్కువ ఆదాయ వృద్ధి సాధించవచ్చని, కానీ భారీ అవినీతి కారణంగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడం వల్ల ఆదాయాల లీకేజీ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని వైసీపీ ఇవాళ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications