ఇది పెత్తందార్లు, పేదల మధ్య యుద్ధం; ఆ షాకింగ్ ఫోటోతో వైసీపీ పోస్ట్ వైరల్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల వ్యూహాలతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక వైఎస్ఆర్సిపి ని ఎలాగైనా ఓడించి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు తమదైన శైలిలో మాటల తూటాలను ఎక్కుపెడుతున్నారు. ఇక సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని ఏపీ ప్రజలు ఆలోచించేలా పోస్టులు పెడుతున్నారు.

తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వచ్చే ఎన్నికలలో పొత్తులతో వైసిపి వ్యతిరేఖ ఓటు బ్యాంకు చీలకుండా ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని అందరికీ అర్థమైంది. ఇక బీజేపీని కూడా జగన్ కు వ్యతిరేఖంగా పొత్తులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే పేదవారి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, పేద వారికి అండగా ఉండే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అందులో భాగంగానే ట్విట్టర్లో ఒక ఫోటోను పోస్ట్ చేసి ఇది పెత్తందార్లకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. ఇక ఈ ఫోటోలో సీఎం జగన్ ఒక వైపు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మరో వైపు ఉన్నారు.
పేదలంతా జగన్ మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. వారికోసం పెత్తందార్ల తో జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని ప్రజలకు చెప్పే విధంగా ఆ పోస్టు ఉంది. అందులో అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి .. ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరివైపు అంటూ ప్రశ్నిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పేదల కోసం పోరాటం చేస్తున్నారని భావన వచ్చేలా ఆ పోస్టు ఉంది.












Click it and Unblock the Notifications