కాసేపట్లో జగన్ కు రఘురామకృష్ణంరాజు సమాధానం- వివరణపై ఉత్కంఠ...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ అధినేత జగన్, పార్టీ నేతలపై విమర్శలకు దిగిన వ్యవహారంలో షోకాజ్ నోటీసులు అందుకున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ తన సమాధానం ఇవ్వబోతున్నారు. అధినేత జగన్ కు సమాధానం ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన రఘురామకృష్ణంరాజు ఇవాళ జగన్ ను కలవడం లేదా ఈ మెయిల్ ద్వారా షోకాజ్ నోటీసులపై స్పందించబోతున్నారు. పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో పేరుతో నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరాలు తెలిపిన రఘురామకృష్ణం రాజు మధ్యాహ్నం 12 గంటలలోపు జగన్‌కు నోటీసులపై సమాధానం ఇవ్వనున్నారు.
Recommended Video
ఇప్పటికే విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణం రాజు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరుకు, తనకు నోటీసులు ఇచ్చిన వారి హోదాకు పొంతన లేదని తెలిపారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమాధానం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించిన ఆయన తాను జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని తెలిపారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘం, లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్రమంత్రులు, నేతలను కలిసిన రఘురామకృష్ణంరాజు... వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వీటి ఆధారంగా ఇవాళ జగన్ కు సమాధానం ఇస్తేనే మేలని అనుకుంటున్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications