లోక్‌సభ స్పీకర్‌తో రఘురామ ఫ్యామిలీ భేటీ- అరెస్టుపై ఫిర్యాదు-ఓం బిర్లా రియాక్షన్‌

ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన రఘురామరాజు కుటుంబ సభ్యులు ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. రఘురామరాజు అరెస్టు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని ఆయనకు వివరించారు.

ఇవాళ ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన నివాసంలో కలిసిన రఘురామకృష్ణంరాజు భార్య రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు భరత్‌.. అరెస్టు, తర్వాత జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ఎంపీగా ఉన్న రఘురామను లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండానే అరెస్టు చేశారని, మెడికల్‌ టెస్టుల సందర్భంగా కూడా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని వారు ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సీఐడీ కస్టడీలో ప్రభుత్వం ఆయన్ను చిత్రహింసలకు గురి చేసిందని కూడా స్పీకర్‌ దృష్టికి తెచ్చారు.

ysrcp rebel mp raghurama raju family met LS speaker, complain on jagan government

రఘురామరాజు కుటుంబ సభ్యులు చెప్పిన విషయాల్ని విన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అసలు ఏం జరిగిందో నివేదిక తెప్పించుకుంటానని హామీ ఇచ్చారు. రఘురామకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపైనా ఓం బిర్లా హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పించుకుంటానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు ఓం బిర్లా వద్దే ఇంకా పెండింగ్‌లో ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+