వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ చేతికి మరో అస్త్రం-కలిసొచ్చిన కేంద్రం స్పందన-ఢిల్లీలో జోరుగా లాబీయింగ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కార్ తో, సీఎం వైఎస్ జగన్ తో సై అంటే సై అంటున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు మరో అస్త్రం దొరికింది. ఇప్పటికే తన లేఖలతో పాటు ఢిల్లీలో ఉన్న పరిచయాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రఘురామ తాజాగా కేంద్రం అనూహ్యంగా అందించిన అస్త్రంతో తన దాడిని మరింత ముమ్మరం చేయబోతున్నారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు తనకు లభించిన ఈ అస్త్రాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదులుకోరాదని ఆయన భావిస్తున్నారు.

రఘురామ జోరు

రఘురామ జోరు

వైసీపీ ప్రభుత్వంతో విభేదించడం మొదలుపెట్టి దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఇప్పటివరకూ అధికార పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన మరింత జోరు పెంచుతున్నారు ఇప్పటికే ప్రభుత్వ విధానాలతో పాటు ఎన్నికల హామీలపై సీఎం జగన్ ను నిలదీస్తూ పలు లేఖలు రాసిన ఆయన.. అటు కేంద్రానికీ ఫిర్యాదులు చేశారు. అదే సమయంలో కేంద్రం నుంచి ఆయనకు పరోక్షంగా మద్దతు లభిస్తుందన్న అంచనాల మధ్య అనర్హత వేటు కోసం వైసీపీ చేసిన ఫిర్యాదును సైతం లోక్ సభ స్పీకర్ సీరియస్ గా తీసుకోవడం లేదు. దీంతో రఘురామ మరింత జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

రఘురామ చేతికి మరో అస్త్రం

రఘురామ చేతికి మరో అస్త్రం

ఇప్పటికే తన వద్దనున్న అస్త్రాలతో వైసీపీ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తాజాగా కేంద్రం ఓ కొత్త అస్త్రం అందించింది. వైసీపీ సర్కార్ గతంలో కేంద్రానికి పంపిన ఓ ప్రతిపాదన తమ పరిశీలనలోనే ఉందని రాజ్యసభలో చేసిన ప్రకటన రఘురామరాజుకు వరంగా మారబోతోంది. దీంతో ఈ ప్రకటన ఆధారంగా ఢిల్లీలో లాబీయింగ్ చేసి దాని ఫలితం వచ్చేలా రఘురామ తన ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నారు. ఇప్పటికే తన కార్యాచరణ కూడా ప్రకటించిన రఘురామ.. త్వరలో దాన్ని అమల్లో పెట్టబోతున్నారు కూడా. దీంతో వైసీపీకి చుక్కలు కనిపించడం ఖాయంగా ఉంది.

కేంద్రం పరిశీలనలో మండలి రద్దు

కేంద్రం పరిశీలనలో మండలి రద్దు

తాజాగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఏపీ శాసనమండలి రద్దు వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిందని, దానిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో ఏపీ శాసనమండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిశీలనలోనే ఉందని కేంద్రమంత్రి రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సమాధానం వైసీపీని ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే గతంలో మండలి రద్దు కోసం తీర్మానం చేసి పంపిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత మాత్రం దానిపై మౌనం వహిస్తోంది. అసెంబ్లీలో తమకు ఉన్న మెజారిటీ సాయంతో ఎమ్మెల్సీ స్ధానాలు ఖాళీ అయినప్పుడల్లా ఏకపక్షంగా వాటిని గెల్చుకుంటోంది. దీంతో వైసీపీకి ఇప్పుడు మండలి రద్దు అవసరం లేకుండా పోయింది. దీంతో వైసీపీ ఈ కీలక వ్యవహారంపై మౌనాన్నే ఆశ్రయిస్తోంది.

వైసీపీ మౌనమే రఘురామ ఆయుధం

వైసీపీ మౌనమే రఘురామ ఆయుధం


ఏపీ శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన తర్వాత మౌనంగా ఉండిపోయిన వైసీపీని గతంలో ఓసారి కెలికిన రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు కేంద్రమంత్రి రాజ్యసభలో ఇచ్చిన జవాబు కొత్త ఊపిరినిచ్చింది. దీంతో ఆయన మండలి రద్దు వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటూ వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు సిద్దమవుతున్నారు. మండలి రద్దుపై త్వరలో కేంద్రమంత్రుల్ని, బీజేపీ పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేస్తానని రఘురామ తాజాగా ప్రకటించారు. అన్నట్లుగానే రఘురామరాజు త్వరలో వారిని కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో వైసీపీ మౌనం రఘురామకు ఆయుధంగా మారిందా అన్న వాదన వినిపిస్తోంది.

కేంద్రానికి ఇదో పరీక్ష

కేంద్రానికి ఇదో పరీక్ష


ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పోరులో నలిగిపోతున్న కేంద్రం.. ఇప్పుడు మరోసారి అగ్నిపరీక్ష ఎదుర్కోబోతోంది. ఎందుకంటే వైసీపీ సర్కార్ తీర్మానం మేరకు ఏపీ శాసనమండలి రద్దు చేస్తే జగన్ కు కోపం వస్తుంది. అలా కాకుండా ఈ వ్యవహారాన్ని మరింత నానబెట్టేందుకు ప్రయత్నిస్తే లోక్ సభలో రఘురామరాజు సహా టీడీపీ ఎంపీలు కూడా ప్రస్తావించి ఇరుకునపెట్టే అవకాశముంది. దీంతో ఇటు జగన్ కు నచ్చచెప్పలేక, అలాగని రఘురామరాజుకు వివరించలేక కేంద్రం ఇబ్బందిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ కేంద్రం వద్ద తనకున్న పలుకుబడితో పలు అంశాల్లో జగన్ పై పైచేయి సాధించిన రఘురామ ఈ పోరులోనూ తానే గెలుస్తానని ధీమాగా ఉన్నారు. అదే జరిగితే రఘురామ పరపతి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

English summary
ysrcp mp raghurama krishnam raju plans to meet central ministers and other nda bosses over abolition of ap legislative council soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X