Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక్కడ జగన్ బ్రేక్ కు అక్కడ రఘురామ కౌంటర్- కేంద్రం సాయంతో- వైసీపీ విలవిల

ఏపీలో వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్రం వద్ద తన పరపతి వాడుకుంటూ జగన్ సర్కార్ కు కంట్లో నలుసుగా మారిపోతున్న రఘురామరాజు మరో వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి గండి కొట్టారు. రాష్ట్రంలో టీడీపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది కౌంటర్ గా ఉండటం మరో విశేషం. దీంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ విలవిల్లాడుతోంది. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకు వీరిద్దరి పోరు మాత్రం విఘాతంగా మారిపోతోంది.

 జగన్ వర్సెస్ రఘురామ

జగన్ వర్సెస్ రఘురామ

ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ తరఫున గెలిచి ఆరునెలల్లోనే పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించడం మొదలుపెట్టిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఊహించిన దాని కంటే వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నారు. ఆరంభంలో రఘురామను పట్టించుకోని వైసీపీ కూడా ఇప్పుడు ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయానికీ కౌంటర్లు వెతుకుతోంది. మరోవైపు లోక్ సభలో ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రఘురామ మరింత రెచ్చిపోతున్నారు. దీంతో జగన్ వర్సెస్ రఘురామరాజు పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారిపోతోంది. ఇందులో ఎవరిది పైచేయి అని రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

 మళ్లీ రఘురామ పైచేయి

మళ్లీ రఘురామ పైచేయి

వైసీపీతో సాగిస్తున్న పోరులో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్రంలో టీడీపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరికి కౌంటర్ గా కేంద్రంలో తన పరపతిని వాడుకుంటూ రఘురామరాజు వేసిన ఎత్తుగడ సక్సెస్ కావడంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ విలవిల్లాడుతోంది. టీడీపీకి జగన్ ఇచ్చిన ఝలక్ కు రఘురామరాజు నుంచి వచ్చిన ఈ కౌంటర్ రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామరాజుకు కేంద్రం పెరుగుతున్న పరపతికి కూడా ఇది నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని కౌంటర్ చేసేందుకు వైసీపీ దారులు వెతుకుతోంది.

 టీడీపీ ఉపాధికి జగన్ గండి

టీడీపీ ఉపాధికి జగన్ గండి


ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద భారీ ఎత్తున పనులు జరిగాయి. కేంద్రంతో అప్పట్లో సత్సబంధాలు నెరిపిన టీడీపీ భారీ ఎత్తున ఉపాధి హామీ పనిదినాలు సాధించుకుంది. పనులైతే జరిగాయి కానీ బిల్లుల చెల్లింపు మాత్రం పూర్తికాకుండానే టీడీపీ సర్కార్ నిష్క్రమించింది. దీంతో కేంద్రం నుంచి ఈ పనులకు వచ్చిన నిధుల్ని టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీ సర్కార్ చెల్లించాల్సిన పరిస్దితి వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని వాడుకున్న జగన్ .. టీడీపీ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా నిలిపేశారు. రెండేళ్లుగా ఈ బిల్లుల చెల్లింపు పూర్తి కాకపోవడంతో విసిగిపోయిన టీడీపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసినా వైసీపీ సర్కార్ ఇప్పటివరకూ బిల్లులు చెల్లించకపోవడంతో టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి దయనీయంగా మారిపోతోంది. హైకోర్టు కూడా పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పరిస్దితుల్లో మార్పురావడం లేదు.

 జగన్ సర్కార్ కు రఘురామ షాక్

జగన్ సర్కార్ కు రఘురామ షాక్

ఎప్పుడైతే టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లు చేసిన ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించకుండా ఆలస్యం చేస్తోందో అప్పుడు రఘురామ మరోసారి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఇప్పటికే జగన్ సర్కార్ ను ఇరుకునపెడుతున్న ఆయన.. ఇప్పుడు టీడీపీ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ భారీ ప్లాన్ వేశారు. జగన్ సర్కార్ బిల్లులు చెల్లించకపోవడాన్ని కారణంగా చూపుతూ కేంద్రాన్ని ఆశ్రయించారు. ఉపాధి హామీ పనులకు మీరిస్తున్న నిధుల్ని జగన్ సర్కార్ చెల్లించడం లేదంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. కాబట్టి నిధులు వెనక్కి తీసుకోవాలంటూ రఘురామ కేంద్రమంత్రిని కోరారు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది.

 జగన్ కు షాకిచ్చిన కేంద్రం

జగన్ కు షాకిచ్చిన కేంద్రం

ఏపీలో ఉపాధి హమీ పథకం అమలు కోసం తాము ఇస్తున్న నిధుల్ని పార్టీల పేరుతో వైసీపీ సర్కార్ చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి లేఖ రాసింది. రఘురామ లేఖపై సమగ్ర వివరణ పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది. గతేడాది కేంద్రం నుంచి రూ.1700 కోట్లు ఉపాధి హామీ నిధులు రావాల్సి ఉంది. ఈ ఏడాదికి రూ.3000 కోట్లు రావాల్సి ఉంది. కానీ రఘురామ లేఖతో ఈ నిధుల విడుదల విషయంలో కేంద్రం బ్రేక్ వేసేసింది. ఏపీలో ఉపాధి హామీ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివరణ ఆధారంగానే కేంద్రం ఈ నిధుల్ని విడుదల చేయబోతోంది. దీంతో ఈ వ్యవహారం వైసీపీ సర్కార్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది.

Recommended Video

    Araku Valley మండల కేంద్రంలో వాహనదారుల అవస్థలు | Visakhapatnam
     చంద్రబాబు-రఘురామ కుట్ర

    చంద్రబాబు-రఘురామ కుట్ర

    ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధుల్ని అడ్డుకునేందుకు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సాయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రకు తెరలేపారని వైసీపీ ఆరోపిస్తోంది. ఉపాధి హామీ నిధుల కోసం ఓవైపు తమ ఎంపీలు పార్లమెంటులో కేంద్రం వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు మాటలు విని రఘురామకృష్ణంరాజు కేంద్రానికి రాసిన లేఖతో ఈ నిధులు రాకుండా పోతున్నాయని వైసీపీ ఆక్షేపిస్తోంది. గతంలో జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలో కలిసి పనిచేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు-రఘురామరాజు మరోసారి రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ నిధులకు గండికొట్టడం ద్వారా పేదలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+