వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపేసేలా ఉన్నారు-కాపాడాలని ఎంపీలకు రఘురామ లేఖ-ఏపీ-తెలంగాణ జాయింట్ ఆపరేషన్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం మాటల యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తాజాగా ప్రధాని మోడీ భీమవరం టూర్ తర్వాత ప్రాణహాని పెరిగిందా ? ఆయన్ను రైల్లోనే చంపాలని ప్రత్యర్ధులు భావించినట్లు చేసిన ఆరోపణలు నిజమేనా ? ఈ విషయంలో ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాయా ? సరిగ్గా ఇదే విషయాల్ని ప్రస్తావిస్తూ సహచర ఎంపీలకు రఘురామకృష్ణంరాజు రాసిన లేఖలు ఇప్పుడు కలకలం రేపుతన్నాయి.

 రఘురామకు ప్రాణహాని

రఘురామకు ప్రాణహాని

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో మూడేళ్లుగా విభేధిస్తూ మాటల యుద్ధం చేస్తున్న రఘురామకృష్ణంరాజు అప్పటి నుంచీ ఢిల్లీలోనే ఉంటున్నారు. మధ్యలో హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. అయితే తాజాగా ప్రధాని మోడీ భీమవరం టూర్ నేపథ్యంలో అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన రఘురామరాజు... ఆ తర్వాత వైసీపీ సర్కార్ పై మాటల దాడిని మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఇంట్లో రఘురామరాజు ఉన్న సమయంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చొరబడటం, ఎంపీ భద్రతా సిబ్బంది అతనిపై దాడికి దిగడం, దీంతో ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. అదే సమయంలో రైల్లోనే తనను తగలబెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ రఘురామ చేసిన ఆరోపణలు ఈ మొత్తం వివాదానికి హైలెట్ గా నిలిచాయి.

ఎంపీలకు రఘురామ లేఖలు

ఎంపీలకు రఘురామ లేఖలు

తాజా పరిణామాల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలని సహచర ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు.
తనపై తప్పుడు కేసులు బనాయించి కస్టడీలోనే అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 'ఏపీ సీఎం జగన్‌ ప్రతీకారేచ్ఛతో అధికారాలను దుర్వినియోగం చేస్తూ సీఐడీ పోలీసులతో నాపై రాజద్రోహం కేసు మోపి.. కస్టడీలోకి తీసుకొని హింసించారని వాపోయారు. ఈ నేపథ్యంలో తనను ఆదుకోవాలని వారికి రఘురామ రాసిన లేఖలు చర్చనీయాంశమవుతున్నాయి.

వీరి నుంచే ప్రాణహాని

వీరి నుంచే ప్రాణహాని

ఎంపీలకు రాసిన లేఖలో రఘురామరాజు తనకు ఎవరెవరి నుంచి ప్రాణహాని ఉందో స్పష్టంగా వివరించారు. ఏపీ సీఎం జగన్‌, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రలతో తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలని పార్లమెంటు సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్‌ ప్రతీకారేచ్ఛతో అధికారాలను దుర్వినియోగం చేస్తూ సీఐడీ పోలీసులతో నాపై రాజద్రోహం కేసు మోపారని, కస్టడీలోకి తీసుకొని హింసించారని ఆరోపించారు. హింసను సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రి ధ్రువీకరించినా కప్పిపుచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కట్టుకథలతో లెక్కకు మిక్కిలి కేసులు బనాయిస్తుండడంతో 30 నెలలుగా తన నియోజకవర్గానికి వెళ్లలేదన్నారు. ఆయా కేసుల్లో ఇప్పటికే 12 స్టేలు ఉన్నాయన్నారు. తనకున్న ముప్పును గుర్తించి కేంద్ర హోంశాఖ రెండేళ్ల కిందట వై కేటగిరి భద్రత కల్పించిందని గుర్తుచేశారు. ఫిబ్రవరి 26న తనపై పోలీసు రెక్కీ నిర్వహించారని, తనకు భద్రతగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గుర్తించి అతన్ని పోలీసులకు అప్పగించారని, అతడిపై పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు.

 ఏపీ-తెలంగాణ జాయింట్ ఆపరేషన్

ఏపీ-తెలంగాణ జాయింట్ ఆపరేషన్

జులై 3న భీమవరం వెళ్లేందుకు తాను రైలు బోగీ బుక్‌ చేసుకున్నానని రఘురామ తెలిపారు. ఈ రైలులోనే తనపై దాడి జరిగే అవకాశముందని సమాచారం అందిందని, ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులుగా చెప్పుకొంటున్న ఇద్దరిని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రైలులో పట్టుకొని తనను కాపాడారన్నారు. దాంతో నేను పక్క స్టేషన్‌లో దిగిపోయానన్నారు. తాను ఇంటికెళ్లాక నంబరు లేని కారు తన ఇంటి చుట్టూ తిరుగుతోందని రక్షణ సిబ్బంది గమనించారని, ఇంటి సీసీ కెమెరాల్లో అది రికార్డయిందన్నారు. ఫుటేజీ కోసం ప్రయత్నిస్తే దాన్ని ఇవ్వవద్దని గచ్చిబౌలి ఎస్‌హెచ్‌వో చెప్పారని తమ గేటెడ్‌ కమ్యూనిటీ సెక్యూరిటీ హెడ్‌ తెలిపారన్నారు. ఇది ఏపీ పోలీసులకు, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రకున్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు.

 జగన్ పై తీవ్ర ఆరోపణలు ?

జగన్ పై తీవ్ర ఆరోపణలు ?

సీఆర్పీఎఫ్‌ నైతికతను దెబ్బతీసేలా.. ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ తన బంగారు ఉంగారాన్ని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది దొంగిలించారనే అనుమానాన్ని వ్యక్తం చేశారని రఘురామ తెలిపారు. విధి నిర్వహణలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలను లెక్కించరని, అలాంటివారిపై తప్పుడు ఆరోపణలను ప్రభుత్వాలు అనుమతిస్తే వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్నారు. అప్పుడు మనల్ని ఎవరూ రక్షించలేరన్నారు. రాజకీయ ప్రేరణతో డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి తనపై తప్పుడు కేసులు మోపుతున్నారని రఘురామ ఆరోపించారు. కస్టడీలోనే తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనకు కల్పించిన భద్రతను రద్దు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇలాంటి విధానాన్నే సీఎం జగన్‌ నాయకత్వంలోని పోలీసులు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై లోగడ ప్రయోగించారన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసమున్న తాను ఈ అడ్డంకులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటున్నానని లేఖలో రఘురామ తెలిపారు. రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌ దురుద్దేశపూర్వక వైఖరికి వ్యతిరేకంగా మీ మద్దతు కోరుతున్నా అంటూ రఘురామ పేర్కొన్నారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju has written letters to co-mps on his life threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X