'బోసడీకే' పదానికి అర్ధం చెప్పిన రఘురామ- గూగుల్ లో దొరికిందట-మొత్తం రచ్చకే హైలెట్

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లోకి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా దూరారు. తాజాగా ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంగ్ ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. పట్టాభి ఏపీ డీజీపీని ఉద్దేశించి వాడినట్లు భావిస్తున్న 'బోసడికే' పదానికి రఘురామ అర్ధం చెప్పారు. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నారు.

పట్టాభి వ్యాఖ్యల కలకలం

పట్టాభి వ్యాఖ్యల కలకలం


ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంగ్ ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి తాజాగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ... మంగళగిరిలో ఉండే .. అంటూ వీరిద్దరిపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు బోసడికే అంటూ ఓ పాత బూతును కూడా తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు పట్టాభి వ్యాఖ్యలన్నీ ఓ ఎత్తు బోసడికే పదం వాడకం ఓ ఎత్తుగా మారిపోయింది. అసలు సీఎం జగన్ చెప్పినట్లుగా వైసీపీ శ్రేణులకు బీపీ రావడానికి ఈ పదం వాడకమే కారణమన్న చర్చ కూడా జరుగుతోంది.

 బోసడికే వ్యాఖ్యలపై రఘురామ రియాక్షన్

బోసడికే వ్యాఖ్యలపై రఘురామ రియాక్షన్

గంజాయి కేసులో ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై విమర్సలు చేసే సమయంలో టీడీపీ నేత బోసడికే పద ప్రయోగం చేశారు. ఇది సర్వత్రా రచ్చకు కారణమవుతున్న నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా దీనిపై స్పందించారు. బోసడికే పదంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు దీని అర్ధమేంటో తెలుసుకునేందుకు రఘురామ చాలా శ్రమించారని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. చివరికి గూగుల్ లో వెతగ్గా, వెతగ్గా ఆయనకు దాని అర్ధం తెలిసిందట.

 గూగుల్ లో రఘురామ సెర్చ్

గూగుల్ లో రఘురామ సెర్చ్

బోసడికే పదం అర్ధం తెలుసుకునేందుకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ తీవ్రంగానే ప్రయత్నించారు. తనకు తెలిసిన స్నేహితుల్ని, ఇతరుల్ని అడిగిన తర్వాత అర్ధం దొరక్కపోవడంతో చివరికి ఆయన గూగుల్ తల్లిని ఆశ్రయించారు. గూగుల్ లో ఈ పదానికి ఆర్ధం ఏముందో తెలుసుకునేందుకు అన్ని భాషల్లోనూ వెతికేశారు. ఇలా వెతగ్గా, వెతగ్గా ఆయనకు బోసడికే పదం అర్ధం దొరికేసిందట. ఈ విషయాన్ని ఆయనే ఇవాళ నిర్వహించిన రచ్చబండ ప్రెస్ మీట్లో వెల్లడించారు. దీంతో అవాక్కవడం రాజకీయ నేతల వంతవుతోంది.

వైసీపీలో అజ్ఢాత స్నేహితుల్ని అడిగిన రఘురామ

వైసీపీలో అజ్ఢాత స్నేహితుల్ని అడిగిన రఘురామ


టీడీపీ నేత పట్టాభి వాడిన బోసడికే పదానికి అర్దాన్ని కనుగొనే ప్రయత్నంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ చాలా మందినే సంప్రదించారు. తనకు తెలిసిన ఓ పాతిక మంది స్నేహితుల్ని అడిగానని, ఆయినా ఏదో బూతు పదం అన్న సమాధానమే వచ్చిందని రఘురామ తెలిపారు. అలాగే వైసీపీలో తన అజ్ఞాత స్నేహితుల్ని కూడా అడిగినట్లు ఆయన చెప్పుకొచ్చారు. వారి నుంచి బోసడికే పదం అర్ధంపై సరైన సమాధానం రాలేదని రఘురామ వెల్లడించారు. చివరికి ఆయన ప్రయత్నాలు గూగుల్ లోనే ఫలించినట్లు తెలుస్తోంది.

 బోసడికే అంటే బాగున్నారా అని అర్దమట

బోసడికే అంటే బాగున్నారా అని అర్దమట

పట్టాభి వాడిన బోసడికే పదాన్ని అందరూ తిట్టుగా భావిస్తున్నారని, కానీ అది తిట్టు కాదని రఘురామ వ్యాఖ్యానించారు. బోసడికే అంటే మీరు బాగున్నారా అని గూగుల్ లో అర్ధం ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. గూగుల్ లో దీని అర్ధం స్పష్టంగా ఉందని రఘురామ తెలిపారు. సంస్కృతంలో బోసడికే అంటే సర్.. మీరు బాగున్నారా అని అర్ధమని రఘురామరాజు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. కానీ సంస్కృతంలో అలాంటి ఓ పదముందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ రఘురామ మాత్రం తాను గూగుల్ లో వెతికానని, అది సంస్కృత పదమని విడమర్చి అర్ధాలు చెప్పేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+