• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోనసీమ మంటల వెనుక షాకింగ్ రీజన్స్ ? సర్కార్ తడబాటు-టీడీపీ, జనసేన యూటర్న్ !

|
Google Oneindia TeluguNews

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో నిన్న చెలరేగిన మంటల వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ వైఖరితో పాటు విపక్షాల యూటర్న్ కూడా ఈ మంటలకు కారణంగా మారినట్లు అర్దమవుతోంది. కోనీసీమలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టే దాకా వెళ్లిన హింసకు మీరంటే మీరే కారణమంటూ అధికార, విపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఇద్దరూ దీనికి కారణమనేది స్ధానికంగా నెలకొన్న పరిస్ధితుల్ని దగ్గరి నుంచి చూస్తున్న వారు చెప్తున్నారు.

పచ్చని కోనసీమలో మంటలు

పచ్చని కోనసీమలో మంటలు

పచ్చని కోనసీమలో జిల్లా పేరు మార్పు మంటలకు కారణమైంది. వైసీపీ సర్కార్ చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియకు ముందు వరకూ ప్రశాంతంగా ఉన్న కోనసీమ ప్రాంతం నిన్న ఒక్కసారిగా భగ్గుమంది. రోడ్లపైకి వచ్చి ఎన్నడూ లేనంత స్ధాయిలో యువత రెచ్చిపోయారు. కోనసీమ పేరు ముద్దు-ఇంకో పేరు వద్దు అంటూ నినదించారు. రాజకీయ పార్టీలు దీని వెనుక మీరంటే మీరంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం హింసలో విపక్షాల పాత్రపై దర్యాప్తుకు సిద్దమవుతోంది. కానీ ఈ ఘటనల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నట్లు స్ధానిక పరిస్ధితుల్ని గమనిస్తే అర్దమవుతోంది.

వైసీపీ సర్కార్ తడబాటు

వైసీపీ సర్కార్ తడబాటు

రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎన్టీఆర్, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, అల్లూరి పేర్లు పెట్టిన ప్రభుత్వం కోనసీమ జిల్లాకు మాత్రం బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు సిద్ధం కాలేదు. ఎందుకంటే కోనసీమలో ఎస్సీలు వర్సెస్ కాపులుగా సాగే పోరుకు దశాబ్దాల చరిత్ర ఉంది. కోనసీమ జిల్లాగా మారిన అమలాపురం నియోజకవర్గం కూడా ఎస్సీలకు రిజర్వు చేసిందే. అమలాపురం అసెంబ్లీ సీటు కూడా ఎస్సీల రిజర్వు చేసిందే. దీంతో ఇక్కడ కాపులు, వర్సెస్ ఎస్సీల పోరును దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కార్ తొలుత అంబేద్కర్ పేరుకు మొగ్గు చూపలేదు.కానీ స్ధానికంగా ఎస్సీ నేతలతో పాటు ముద్రగడ వంటి కాపు నేతల నుంచి కూడా వచ్చిన డిమాండ్లతో పేరు మార్పుకు సిద్ధపడింది. ఫైనల్ గా వారం క్రితం జిల్లా పేరుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నా మకరణం చేసింది. దీంతో మరో చిచ్చు రేగింది.

 టీడీపీ, జనసేన యూటర్న్ ?

టీడీపీ, జనసేన యూటర్న్ ?

కోనసీమ జిల్లా పేరు మార్పుకు స్ధానికంగా వచ్చిన డిమాండ్లతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం.. ఇందులో అన్ని పక్షాలను భాగస్వాముల్ని చేయడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూడాలని అనుకుంది. దీంతో టీడీపీ, జనసేన పార్టీల అభిప్రాయాలుసేకరించింది. దీంతో వీరు కూడా అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టాలనే కోరారు. ఇదే అదనుగా ప్రభుత్వం పేరు మారుస్తూ నిర్ణయం తీసేసుకుంది. కానీ ఈ నిర్ణయంపై స్ధానికంగా ఉన్న నాన్ ఎస్సీలు భగ్గుమన్నారు. అప్పటికే ఎస్సీలతో వీరికి ఉన్న వివాదాలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతిమంగా స్ధానికంగా ఉన్న యువతను రెచ్చగొట్టేలా చేసింది. చివరికి కోనసిమ భగ్గుమనేలా చేసింది.

 విపక్షాలకు ప్రయోజనం ?

విపక్షాలకు ప్రయోజనం ?


కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు కోనసీమ ప్రాంతం భగ్గుమంటోంది. పార్టీలకతీతంగా ఎస్సీలు వర్సెస్ ఇతరులుగా మారిపోతున్నారు. దీంతో క్షేత్రస్దాయిలో ఈ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఛలో రావులపాలెం కార్యక్రమానికి సైతం ఎస్సీలు కానివారందరినీ ఆహ్వానించారు. దీంతో అక్కడ ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకు రాజకీయాలు మరిగిన రాజకీయ పార్టీలు అవకాశం కూడా ఎదురుచూస్తున్నాయి. కానీ ఇలాంటి నిర్ణయాలు అధికారంలో ఉన్న పార్టీలకే చేటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు విపక్షాలు దీన్నుంచి లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీ కూడా విపక్షాలు రాజకీయ లబ్ది కోసమే కోనసీమలో హింసకు దిగుతున్నారని ఆరోపిస్తోంది.

English summary
ysrcp govt's hesistation and tdp, jansena's u turn is seems to be the reasons behind konaseema's violence yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X