టీడీపీ ముఖ్య నేతతో సాయిరెడ్డి మంత్రాంగం..!? వైసీపీ వీడియో విడుదల..!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. ఇటు వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పై కేసులు నమోదయ్యాయి. ఆ పార్టీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో వైసీపీ మాజీ ముఖ్య నేత సాయిరెడ్డిని సిట్ విచారణ చేస్తోంది. కాగా, సాయిరెడ్డి ఈ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేత తో రహస్య మంత్రాంగం చేసారని ఆరోపిస్తూ వైసీపీ ఒక వీడియో విడుదల చేసింది.
లిక్కర్ కేసులో పలువురు వైసీపీ నేతల ప్రమేయం పైన విచారణ సాగుతోంది. ఇందులో సాయిరెడ్డి, మిథున్ రెడ్డి సైతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసారు. కాగా, సాయి రెడ్డి ఈ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేతతో రహస్య మంత్రాంగం చేసారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన మీడియా సమావేశంలో సైతం సాయిరెడ్డి లక్ష్యంగా జగన్ కీలక వ్యాఖ్య లు చేసారు. టీడీపీ కూటమికి మేలు చేసేందుకే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసారని జగన్ ఆరోపించారు. ఇక, ఇప్పుడు వైసీపీ తమ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసింది. అందులో సాయిరెడ్డి లిక్కర్ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేతను కలిసారని ఆరోపణ చేస్తూ..పలు అంశాలను ప్రస్తావించింది.

వైసీపీ చేసిన ట్వీట్ లో విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు.. అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించింది. మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగినట్లు పేర్కొంది. తాడేపల్లి పార్క్ విల్లాలో.. విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి వచ్చారని వివరించింది.
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు..
— YSR Congress Party (@YSRCParty) May 25, 2025
మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం
తాడేపల్లి పార్క్ విల్లాలో..
విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి
13 నిమిషాల తర్వాత అదే విల్లాకు @ncbn నమ్మినబంటు టీడీ జనార్ధన్.… pic.twitter.com/XYgtZsJSE4
13 నిమిషాల తర్వాత అదే విల్లాకు టీడీపీ నేత టీడీ జనార్ధన్ వచ్చినట్లు పేర్కొంది. 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిగాయని విశ్లేషించింది. కాగా, విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైయస్ జగన్‌పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు చేసారని చెప్పుకొచ్చింది. ఇది నమ్మకం ద్రోహం కాదా? అంటూ ప్రశ్నించింది. కాగా, సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీ చేస్తున్నఈ ఆరోపణల పైన ఎలా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications